← ప్రశ్నపత్రాలు
1. TS Police Constable Prelims - 2015 (తెలుగు)
200 ప్రశ్నలు 0 of 200 answered
Text size
Filter
Jump to
Purchase this subject for 45 days of unlimited access.
View plansMock Test Starting…
00:00
Question 1 of 1
Exit mock test? Your progress on this attempt will be lost.
1. Choose the right matching of one word substitutes with their description.
(i) Congestion
(ii) Collision
(iii) Bottleneck
(iv) Breakdown
(A) An accident in which two vehicles hit each other
(B) Situation in which roads are full of traffic
(C) Occasion when a vehicle stops working
(D) Place in a road where the traffic cannot pass
2. Choose the right rearrangement of the following sentences into a meaningful paragraph.
A. They are broken into small pieces called "places".
B. A painter once discovered something possible and valuable about this street.
C. One street goes across itself one or two times.
D. They turn in different directions.
E. In a small part of the city west of Washington Square, the streets have gone wild.
3. Fill in the blanks with right verb forms to make it a meaningful sentence.
If you ______ hard in your school days, you ______ this examination today.
4. Identify the part of the sentence which has an error in the following statements.
Children washed (A)/their hands (B)/after they played (C)/with a new born puppy (D).
5. Choose the correct meaning of the italicized idiomatic expression in the following sentences.
You cannot have your cake and eat it too.
6. Find the correct order of the words to form a sentence.
a - travel
b - I
c - and
d - together
e - Satish
7. To "take a leaf out of someone's book" is to
8. What is the meaning of the word 'Kudos' in 'Kudos to the crumbs of entrance test'?
9. To 'show someone the ropes' is to
10. From the following pairs of words, select the one which is synonymous:
11. Match the left-hand column with the right-hand column with the help of the codes given below:
(i) a person who goes out and gets stories for newspapers
(ii) a person who writes articles in newspapers and magazines
(iii) a newspaper you can buy every day after about 5 p.m.
(iv) a magazine that children read, with cartoon pictures
(v) a programme on TV about animals, birds etc.
(A) A nature programme
(B) A Comic
(C) An evening (news) paper
(D) A journalist
(E) A reporter
12. Replace the underlined phrase by the correct alternative.
They left no stone unturned to trace the culprits.
13. Fill in the blank with a suitable word to make the following sentence a meaningful one.
The festival is a three-day-long celebration that combines ______ feasts as well as ______ fasting.
14. Choose the right rearrangement of the following sentences into a meaningful paragraph.
(A) We have ten percent growth rate in most areas. Our Poverty levels are falling.
(B) For fifty years, we have been a developing nation.
(C) We are among top 5 nations of the world in terms of GDP
(D) My second vision is for India's development.
(E) It is time we see ourselves as a developed nation.
15. ______ uranium is ______ toxic metal. ______ uranium in Australia covers 31% of ______ world's known uranium ore reserves.
16. Choose the right alternative to make it a meaningful sentence.
Tea may be used to ______ Coffee.
17. What is the antonym of the word 'pious' in 'She is a pious woman'.
18. The author names three different ways in which a man may react to sudden danger. What are they?
19. Why does the author feel happy in the recollection of dangers faced and overcome?
20. Select an appropriate title for the passage.
21. పునరావృత దశాంశ విస్తరణ 0.12̅ కల్గిన ఆకరణీయ సంఖ్య
22. నాలుగు వరుస సంఖ్యలు A, B, C మరియు D ల సగటు 35.5. అప్పుడు, B మరియు C ల లబ్దము
23. 450, 600 మరియు 900 చే నిశ్శేషంగా భాగింపబడే అతి చిన్న ధన సంఖ్య
24. రెండు సంఖ్యలు x, y లు x : y = 2 : 3 అవుతూ వాటి గరిష్ఠ సామాన్య గుణకం 900 అయితే,
xy =
25. P, Q మరియు R అనే ముగ్గురు వ్యక్తులకు రూ. 8750/- పంచవలెను. P మరియు R ఇద్దరికి పంచబడిన మొత్తానికి 1/4 భాగం Qకి పంచబడినది. Q మరియు R ఇద్దరికి పంచబడిన మొత్తానికి 2/5 భాగం Pకి పంచబడినది. అప్పుడు Pకి పంచబడిన మొత్తం (రూపాయలలో)
26. రెండు సంఖ్యలు 5 : 7 నిష్పత్తిలో ఉన్నవి. ప్రతి సంఖ్య నుండి 8 తీసివేస్తే వాటి నిష్పత్తి 2 : 3 అవుతుంది. ఆ రెండు సంఖ్యల లబ్దం
27. ఒక దీర్ఘచతురస్రము యొక్క పొడవు 10% తగ్గించారు, కాని దాని వైశాల్యము మారలేదు. అప్పుడు ఆ దీర్ఘ చతురస్రము యొక్క వెడల్పులో పెరుగుదల శాతము
28. ఒక చిన్న గ్రామము యొక్క జనాభా సంవత్సరమునకు 8% పెరుగును. ప్రస్తుతము, ఆ గ్రామము యొక్క జనాభా సంఖ్య 23328 అయితే, 2 సంవత్సరముల క్రిందట ఆ గ్రామము యొక్క జనాభా
29. A, B లు వరుసగా రూ. 3.5 లక్షలు, రూ. 6.5 లక్షలు పెట్టుబడులతో వ్యాపారం ప్రారంభించారు. ఆరు నెలల తరువాత A వ్యాపారం నుండి తప్పుకోగా, రూ. 7.5 లక్షలు పెట్టుబడితో C అనే వ్యక్తి Bతో కలిశాడు. సంవత్సరాంతపు లాభం రూ. 2.4 లక్షల్లో C వాటా (లక్షల రూపాయలలో)
30. A, B, C అనే ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక కంపెనీని ప్రారంభించారు. ముగ్గురు కలిసి కంపెనీలో పెట్టిన మొత్తం రూ. 5,20,000/-. B కంటే రూ. 40,000/- ఎక్కువ A; C కంటే రూ. 60,000/- ఎక్కువ B, కంపెనీకి ఇచ్చారు. కంపెనీకి రూ. 1,95,000/- లాభం వస్తే Cకి వచ్చే వాటా (రూపాయలలో)
31. K సంఖ్యల మొత్తం 2000 మరియు వాటి సగటు 50. ఆ సంఖ్యలకు 91 కూడా జోడిస్తే కొత్త సగటు
32. ఆరు సంవత్సరముల పూర్వము, ముగ్గురు సభ్యుల కుటుంబము యొక్క సగటు వయస్సు 29 సంవత్సరములు. దీని తరువాత ఆ కుటుంబములో ఒక బిడ్డ పుట్టెను. ఈ రోజున (ఇప్పుడు), ఆ కుటుంబము యొక్క సగటు వయస్సు 25 సంవత్సరములు. ఈ రోజున, ఆ బిడ్డ వయస్సు
33. ఒక దుకాణదారునికి ఒక TV యొక్క కొనుగోలు ధర రూ. 22,000/-. అతను ఆ TV ధరను 15% పెంచినాడు. ఆ తరువాత, ఆ TV ధరని 20% తగ్గించి అమ్మినాడు. ఆ దుకాణదారునికి వచ్చిన నష్ట శాతము
34. ఒక దుకాణదారుడు ఒక మొబైల్‌ను 8% లాభముతో రెండవ దుకాణదారునికి అమ్మినాడు. రెండవ దుకాణదారుడు 6% లాభముతో మూడవ దుకాణదారునికి అమ్మినాడు. మూడవ దుకాణదారుడు రూ. 2862/-లకు ఈ మొబైల్‌ను కొంటే, మొదటి దుకాణదారునికి ఈ మొబైల్ యొక్క అసలు ధర (రూపాయలలో)
35. రూ. 12,000/-లను సంవత్సరానికి 12% సాధారణ (సరళ) వడ్డీకి ఇచ్చిన, T సంవత్సరాలలో అది రూ. 16,320/-అయితే, T విలువ (సంవత్సరాలలో)
36. సంవత్సరమునకు 8% వడ్డీతో 2 సంవత్సరములలో చక్రవడ్డీ, సాధారణ (సరళ) వడ్డీల మధ్య వ్యత్యాసము రూ. 800/-. అప్పుడు, సొమ్ము A (రూపాయలలో)
37. మోహన్ ఒక పరికరమును 40 గంటలలో బాగుచేయగలడు. రామ్ అదే పరికరమును 30 గంటలలో బాగుచేయగలడు. మోహన్ మరియు రామ్ కలిసి ఆ పరికరముపై 8 గంటల సేపు పని చేసిన తరువాత, మోహన్ పని వదలి వెళ్ళిపోయాడు. మిగిలిన పనిని పూర్తి చేయుటకు రామ్ తీసుకొనే సమయము (గంటలలో)
38. A అను వ్యక్తి ఒక పనిని 20 రోజులలో పూర్తి చేయగలడు. ఆ పనిని అతను 5 రోజులు చేసి మానివేశాడు. మిగతా పనిని B అను రెండవ వ్యక్తి 9 రోజులలో పూర్తి చేశాడు. A మరియు B కలిసి పనిచేస్తే, ఎంత కాలంలో పనిపూర్తి చేస్తారు?
39. 80 మీటర్లు పొడవు గల ఒక రైలు 108 km/hr (గంటకు కిలోమీటర్లలో) వేగంతో వెళ్ళుచున్నది. 130 మీటర్లు పొడవు గల ఒక ప్లాట్ఫారంను దాటి వెళ్ళుటకు ఆ రైలు తీసుకొనే సమయము (సెకండులలో)
40. 100 మీటర్లు మరియు 80 మీటర్లు పొడవు గల రెండు రైళ్ళు ఒకే వైపు వరుసగా 80 km/hr (గంటకు కిలోమీటర్లలో) మరియు 60 km/hr వేగంతో వెళ్ళుచున్నవి. మొదటి రైలు రెండో రైలును దాటి వెళ్ళుటకు కావలసిన సమయము (సెకండులలో)
41. 6 గురు పురుషులు, ముగ్గురు స్త్రీల నుండి, 6 గురు సభ్యులు గల ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలి. కనీసం ఒక స్త్రీ ఉండేటట్లు ఏర్పడే సంఘాల సంఖ్య
42. సోమవారము (Monday) రోజున జరిగే పరీక్ష ఏది?
43. ఏయే పరీక్షలకు మధ్యన English పరీక్ష జరుగుతుంది?
44. Mathematics మరియు EVS పరీక్షలు ఏయే రోజులలో జరుగుతాయి?
45. పట్టిక Iలో రెండు ఘనముల వక్రతలీయావరణముల (Surface areas) నిష్పత్తులు ఇవ్వబడినవి. పట్టిక IIలో వాటి ఘన పరిమాణముల నిష్పత్తులు ఇవ్వబడినవి. వాటిని జతపరచండి:
జాబితా-I
(a) 1 : 16
(b) 1 : 25
(c) 1 : 9
జాబితా-II
(i) 1 : 125
(ii) 1 : 27
(iii) 1 : 36
(iv) 1 : 64
46. క్రింది వానిని జతపరచండి
జాబితా-I
(a) రేడియో ప్రసారాలు
(b) సముద్ర మరియు సంచార సాధనాలు
(c) టి.వి. ప్రసారాలు
(d) ఉపగ్రహ సమాచారం
జాబితా-II
(i) LF బాండ్
(ii) HF బాండ్
(iii) SHF బాండ్
(iv) VHF బాండ్
47. ఈ క్రింది ప్రవచనములు చదవండి
(a) కంపన శక్తి స్థాయిల్కి ఉత్తేజపరిచి యానకములోని అణువులు కాంతిని పరిక్షేపణము చెందించడాన్ని రామన్ ప్రభావము వివరిస్తుంది.
(b) ఒక నిత్యత్వ నియమము అనునది ఒక పరికల్పన (వాదన) మరియు నిరూపించబడలేనిది, కాని ప్రయోగాల ద్వారా దానిని నిర్థారించవచ్చు.
(c) భగోళ మరియు భౌగోళిక ప్రదేశములలో ఒకే గమన మరియు గురుత్వ సూత్రాలను అనువర్తించలేని సర్ ఐజాక్ న్యూటను నిరూపించాడు.
సరియైన సమాధానము:
48. ప్రతిపాదన (A): విద్యుత్ మోటరు యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది.
కారణము (R): అన్యోన్య ప్రేరకత్వము సూత్రంబై విద్యుత్ మోటారు పనిచేస్తుంది.
49. మూసివేసిన ఒక పాత్ర సగము వరకు నీటితో నింపబడింది. దానిపై భాగంలో ఒక రంధ్రము ఉంది మరియు ఈ రంధ్రము ద్వారా గాలిని బయటకు తోడేసారు. అప్పుడు
(a) ద్రవం యొక్క సాంద్రత తగ్గుతుంది
(b) నీటి తలం వద్ద పీడనం తగ్గుతుంది
(c) పాత్రలో నీటి మట్టము పెరుగుతుంది
(d) పాత్ర అడుగున నీరు కలిగించే బలం తగ్గుతుంది
పైన ఇచ్చిన ప్రవచనములలో ఏవి సరైనవి?
50. కాంతి గాలి నుండి నీటిలోకి ప్రయాణించినపుడు ఈ క్రింది వానిలో ఏది మారు చెందని
51. గది ఉష్ణోగ్రత వద్ద ఫెర్రో అయస్కాంత ధర్మాన్ని చూపించే మూలకాలు
52. క్రింది వాటిలో ప్లెక్సిగ్లాజు తయారీలో ఉపయోగించునది ఏది?
53. క్రింది వాటిని జతపరచుము
జాబితా-I
(A) కాలుష్యరహిత వాన నీటి pH
(B) టెఫ్లాన్
(C) బ్యూన-N
(D) పాలిస్టైరీన్
జాబితా-II
(I) అచ్చుపోసిన పాత్రలు
(II) హోస్‌పైప్
(III) 5.6
(IV) రంగులు
(V) కందెన పదార్థం
54. బెరిబెరి అను వ్యాధి ఈ విటమిన్ లోపం వల్ల వస్తుంది:
55. మాంసం మరియు చేపలను శుద్ధి చేయుటానికి (curing) వాడే సమ్మేళనము
56. క్రింది వాటిని జతపరచుము
జాబితా-I
(A) ప్లావర్-సేవర్ టొమేటో
(B) గోల్డెన్ రైస్
(C) రౌండ్ అప్ రెడి సోయా చిక్కుడు
(D) Bt-పత్తి
జాబితా-II
(I) కీటకాల ప్రతిరోధకత
(II) గుల్మనాశకుల ప్రతిరోధకత
(III) ఎక్కువ విటమిన్-A
(IV) పక్వతలో ఆలస్యము
57. ట్రాంక్విలైజర్కు ఉదాహరణ
58. 'అణు కత్తెరలు'గా అభివర్ణించబడే ఎన్జైమ్ ఏది?
59. ప్రతిపాదన (A): జలపాతం యొక్క పాదం వద్ద ఉన్న నీరు శిఖరం వద్ద ఉన్న నీటి ఉష్ణోగ్రతలు ఎల్లప్పుడు వేరుగా ఉంటాయి.
కారణం (R): క్రిందికి పడుతున్నప్పుడు శిఖరం వద్ద గల నీటి స్థితిజ శక్తి, ఉష్ణ శక్తిగా రూపాంతరం చెందుతుంది.
60. ప్రతిపాదన (A): నీలి కాంతిలో కంటే ఎరుపు కాంతిలో కిరణజన్య సంయోగ క్రియారేటు ఎక్కువ
కారణం (R): ఎరుపు ఫోటాన్ శక్తి, నీలి ఫోటాన్ శక్తి కంటే ఎక్కువ
61. క్రింది వానిని జతపరచండి
వివిధ దృక్సాధనాలు ఏర్పరిచే అంతిమ ప్రతిబింబము
జాబితా-I
(a) సరళ సూక్ష్మ దర్శిని
(b) భౌగోళిక దూరదర్శిని
(c) సంయుక్త సూక్ష్మ దర్శిని
(d) ఖగోళ దూరదర్శిని
జాబితా-II
(i) మిథ్య, నిటారు, చిన్నది
(ii) మిథ్య, తలకిందులైన, చిన్నది
(iii) మిథ్య మరియు పెరిగిన
(iv) ఆవర్ధనము చెందిన, మిథ్య మరియు తలక్రిందులైన
62. క్రింది వానిని జతపరచండి.
జాబితా-I
(A) ఓజోన్ క్షీణత
(B) హరిత గృహ ప్రభావం
(C) అమెరికాలోని త్రీ మైల్ దీవ్పం
(D) టెర్రర్ ఆఫ్ బెంగాల్
(E) పక్షులలోని కాల్షియం జీవ క్రియ పై ప్రభావం
జాబితా-II
(I) రేడియో ధార్మిక వ్యర్థాలు
(II) గుర్రపు డెక్క ఆకు మొక్క
(III) అధిక గాఢత డిడిటి వల్ల
(IV) క్లోరోఫ్లోరోకార్బన్లు
(V) CO2 మరియు మిథేన్
63. 'A' మరియు 'B' ప్రతి జనకాలను కలిగి ఎటువంటి ప్రతి రక్షకాలు లేనటువంటి వ్యక్తి ఏ రకమైన రక్త వర్గానికి చెందుతాడు
64. మానవునిలో చర్మపు రంగు దీనికి ఉదాహరణ
65. రక్తపు ప్రతి ఘన మిల్లీమీటర్లో ఉండే రక్త కణాల సంఖ్యను ఆరోహణ క్రమములో తెలుపుము
(A) బేసోఫిల్స్
(B) లింఫోసైట్స్
(C) ఇసినోఫిల్స్
(D) న్యూట్రోఫిల్స్
(E) మోనోసైట్లు
66. శబ్ద కాలుష్యం ప్రకారం, మానవుని చెవిలో నొప్పి కలిగించే స్పర్శకు ప్రేరణ హద్దు ఎంత
67. జత పరుచుము
జాబితా-I
(A) గంగా కార్యాచరణ ప్రణాళిక
(B) వాయు (కాలుష్య నివారణ మరియు నియంత్రణ) చట్టం
(C) పర్యావరణ (సంరక్షణ) చట్టం
(D) జల (కాలుష్య నివారణ మరియు నియంత్రణ) చట్టం
జాబితా-II
(I) 1986
(II) 1974
(III) 1985
(IV) 1980
(V) 1981
68. ఈ క్రింది వాటిని జతపరచుము
జాబితా-I
(A) CO2
(B) SO2
(C) NO
(D) CO
జాబితా-II
(I) భవనాలు, చారిత్రక కట్టడాలు త్వరగా శిథిలమగుట (corrosion)
(II) ఆకులపై భాగంలో కణజాలక్షయ మచ్చలు ఏర్పడుట
(III) తలనొప్పి, మసక బారిన దృష్టిని కలిగించుట
(IV) హరిత గృహ ప్రభావం
69. ఈ క్రింది ప్రవచనములను అధ్యయనం చేయండి
(A) అరణ్య ఆవరణ వ్యవస్థ యొక్క సంఖ్యాపర పిరమిడ్ నిటారుగా ఉంటుంది
(B) ఆహారపు గొలుసులో ప్రాథమిక వినియోగదారులు శాకాహారులు
(C) పరాన్నజీవుల ఆహార గొలుసులో సంఖ్యా పిరమిడ్ తల క్రిందులాగా ఉంటుంది
(D) శక్తి పిరమిడ్ ఎప్పుడూ తలక్రిందులాగా ఉంటుంది
సరియైన ప్రవచనములు గుర్తించుము
70. క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి
(A) స్ట్రాటోస్పియర్లో U.V. కిరణాల చర్యల వల్ల CFC అణువుల నుంచి క్లోరిన్ పరమాణువులు విడుదల అవుతాయి
(B) U.V. – A కిరణాలు DNAని దెబ్బతీసి, ఉత్పరివర్తనాలను ప్రేరేపిస్తాయి
(C) U.V. – B కిరణాలవల్ల చర్మం ముడతలు పడటం, చర్మ కణాలు దెబ్బతినడం జరుగుతుంది
(D) U.V. – C కిరణాలవల్ల కార్నియా దెబ్బతిని 'స్నో బ్లైండ్నెస్' వచ్చును
సరియైన ప్రవచనములను గుర్తించుము:
71. ఈ క్రింది వానిని జతపర్చండి
జాబితా-I
(a) మృచ్ఛకటిక
(b) ముద్రారాక్షసము
(c) అమరకోశము
(d) బృహత్సంహిత
జాబితా-II
(i) విశాఖదత్తుడు
(ii) శూద్రకుడు
(iii) వరాహమిహురుడు
(iv) అమరసింహాడు
72. ప్రతిపాదన (A): రెండవ పులకేశి హర్షవర్ధనుని ఓడించాడు.
కారణము (R): ఉత్తర భారతదేశంలో తన సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకున్నాడు.
73. క్రింది వారిలో ఎవరు బౌద్ధ సంఘములో సభ్యులు కావడానికి అర్హులు?
(A) 15 సంవత్సరాలు పైబడిన స్త్రీలు
(B) రాజసేవలో ఉన్నవారు
(C) కుష్టువ్యాధి లేనివారు
(D) అప్పులో ఉన్నవారు
74. సరియైన జతను గుర్తించండి
75. క్రింది వానిని జతపరచుము
జాబితా-I
(a) అదిచనల్లూర్
(b) హరప్పా
(c) అరికమీడు
(d) భీమ్బెట్కా
జాబితా-II
(I) రాతిపై చిత్రాలు
(II) రోమ్తో వ్యాపారము
(III) బృహత్ శిలాయుగము
(IV) తామ్రరాతి యుగము
76. అగ్రహారమనగా నేమి?
77. ప్రతిపాదన (A): సముద్ర గుప్తుడు వీణ వాయిస్తున్నట్లుగా కొన్ని బంగారు నాణెములపై ముద్రించారు
కారణం (R): ఆయన సంగీతంలో నిపుణుడు
78. క్రింది వానిని జతపరచుము
జాబితా-I
(a) పారమారులు
(b) సోలంకిలు
(c) చందేలులు
(d) కాలచూరిలు
జాబితా-II
(I) జయసింహ సిద్ధరాజు
(II) భోజుడు
(III) గంగయదేవుడు
(IV) యశోవర్మ
79. ఈ క్రింద ఇవ్వబడిన చోళుల కాలంనాటి పాలనా భాగములను అవరోహణా క్రమంలో అమర్చండి
80. ప్రతిపాదన (A): భారతదేశంలో బ్రిటిషు ప్రభుత్వం అంటరానితనాన్ని నిషేధించలేకపోయింది.
కారణము (R): భారతీయ సమాజంలోని సనాతన వర్గాలలో వ్యతిరేకత పెరుగుతుందని భయపడింది.
81. ఈ క్రింది వానిలో ఏ వాక్యం సరి అయింది కాదు
82. క్రింది వానిని జతపరచుము
జాబితా-I
(a) గుల్బధన్ బేగమ్
(b) అబుల్ ఫజల్
(c) నిజాముద్దీన్ అహ్మద్
(d) దారాషికో
జాబితా-II
(I) సాకినాత్-ఉల్-ఔలియా
(II) హుమాయూన్ నామా
(III) తబాకత్-ఇ-అక్బరీ
(IV) ఐన్-ఇ-అక్బర్
83. ఈ క్రింది వాటిలో తప్పుగా జతపరిచింది
84. 1856లో ఏ కారణముపై లార్డ్ డల్హౌసీ ఔద్ (Oudh) సంస్థానమును ఆక్రమించెను
85. ప్రతిపాదన (A): బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా అనిబిసెంట్ హోమ్ రూలు ఉద్యమాన్ని నడిపారు
కారణం (R): ఆమె భారతీయులందరిని ఒకే చత్రం క్రిందికి చేర్చాలని ఆకాంక్షించింది
86. పుణేలో ఒక వింతతు శరణాలయాన్ని స్థాపించి, 1893లో ఒక వితంతువును వివాహమాడినదెవరు
87. క్రింది వాటిలో తప్పుగా జతపరిచింది ఏది?
88. ఈ క్రింది వాటిలో తప్పుగా జతపరిచింది ఏది?
89. మద్రాసు నుండి ప్రచురింపబడిన మొదటి సాయంత్రపు ఆంగ్ల దినపత్రిక
90. క్రింది వానిని జతపరచండి.
జాబితా-I
(a) హిస్టరీ ఆఫ్ ఇండియా
(b) హిస్టరీ ఆఫ్ మిడీవల్ ఇండియా
(c) హిస్టరీ ఆఫ్ మ్రాడన్ ఇండియా
(d) హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా
జాబితా-II
(i) కె.ఎ. నీలకంఠ శాస్త్రి
(ii) బిపన్ చంద్ర
(iii) రోమిల థాపర్
(iv) సతీష్ చంద్ర
91. ఈ క్రింది ప్రవచనములను చదువుము
(a) మన పర్యావరణములో నత్రజని వాయువు గాఢత అత్యధికంగా ఉన్నది
(b) పప్పు ధాన్యాలను అధికముగా ఉత్పత్తి చేయు రాష్ట్రం మధ్య ప్రదేశ్
(c) లోక్టాక్ సరస్సు మేఘాలయలో ఉన్నది
సరియైన సమాధానము:
92. క్రింది వానిలో సరియైన ప్రవచనము ఏది?
93. ఈ క్రింది వానిని జతపర్చండి.
జాబితా-I
(a) ఆరావళి పర్వతములు
(b) నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం
(c) మహేంద్ర గిరి పర్వతములు
(d) పశ్చిమ కనుమలు
జాబితా-II
(i) తూర్పు కనుమలు
(ii) కందేశ్ పర్వతములు
(iii) దొడ్డబెట్ట
(iv) మాల్వా పీఠభూమి
94. క్రింది వాటిని జతపరచుము:
ప్రతిపాదన (A): 1991 నుండి భారతదేశ జనాభా పెరుగుతూ 2011 సంవత్సరం నాటికి సుమారుగా 125 కోట్లకు చేరింది
కారణం (R): 1991 నుండి భారతదేశంలో ఆరోగ్య సౌకర్యాలు మెరుగుపడుటవలన మరణాల రేటు బాగా తగ్గిపోయింది
95. క్రింది వాటిని జతపరచుము:
జాబితా-I
(a) సియాచిన్ హిమనది
(b) బుండి హిల్స్
(c) సత్పుర పర్వతములలో ఎత్తైన బిందువు
(d) శివాలిక్ పర్వత శ్రేణి
జాబితా-II
(I) మాల్వా పీఠభూమి
(II) మిష్మి పర్వతములు
(III) కారకోరం శ్రేణులు
(IV) మహాదేవో పర్వతములు
96. క్రింది ప్రకటనలు చదువుము
(a) అరుణాచల్ ప్రదేశ్‌లో శివాలిక్ పర్వత శ్రేణులను మిష్మి కొండలు అంటారు.
(b) మినికాయ్ ద్వీపాలు అరేబియా సముద్రంలో ఉన్నవి.
(c) కొనిఫర్ కలపను కాగితపు తయారీలో ముడి పదార్థంగా ఉపయోగిస్తారు.
సరియైన సమాధానం
97. స్వర్ణ చతుర్భుజ జాతీయ రహదారి మార్గము క్రింది నగరాలను కలుపును
98. క్రింది ప్రవచనములను చదవండి
(a) పంచాయతీ రాజ్ వ్యవస్థలో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించిన మొదటి రాష్ట్రము బీహార్
(b) లోక్‌సభలో షెడ్యూల్డ్ కుల సభ్యులకు రిజర్వేషన్ చేయబడిన స్థానాలు 84
(c) లోక్‌సభలో షెడ్యూల్డ్ తెగల సభ్యులకు రిజర్వేషన్ చేయబడిన స్థానాలు 41
సరియైన సమాధానము:
99. క్రింది వాటిని జతపరచుము
జాబితా-I
(a) వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్
(b) నియోజక వర్గాల పునర్విభజన కమిషన్
(c) జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్
(d) జాతీయ మహిళా కమిషన్
జాబితా-II
(I) జస్టిస్ కుల్దీప్ సింగ్
(II) జస్టిస్ వి. ఈశ్వరయ్య
(III) డాక్టర్ రామేశ్వర ఒరాన్
(IV) లలిత కుమార్ మంగళం
100. క్రింది ప్రవచనములను పరిగణించుము:
(a) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమించును
(b) గ్రామ సభ రాజ్యాంగ సంస్థ
(c) న్యాయశాఖ నుండి కార్యనిర్వాహకశాఖ వేరు చేయడము ప్రభుత్వ రాజ్యతంత్రంలో ఒక ఆదేశిక సూత్రము
పై ప్రవచనములలో ఏది/ఏవి సరియైనవి
101. ప్రతిపాదన (A): పారే నీళ్ళు మరియు పవనాల మూలంగా భూమి యొక్క పై పొర కొట్టుకుపోవటాన్ని భూక్రమక్షయం అంటారు.
కారణం (R): ఒండ్రు మట్టి నేలలు సారవంతంగా ఉండి అన్ని రకాల పంటల సేద్యానికి అనుకూంగా ఉంటాయి.
102. ప్రతిపాదన (A): విత్త బిల్లును రాష్ట్రపతి తిరిగి పార్లమెంటుకు పంపించలేడు
కారణం (R): రాష్ట్రపతి అనుమతితో విత్త బిల్లు లోక్‌సభలో ప్రవేశ పెట్టబడును
103. మంత్రి మండలి ఏర్పాటు దీనితో ఆరంభం అవుతుంది
104. క్రింది వాటిని జతపరచుము:
జాబితా-I
(a) మొదటి ఆర్థిక సంఘము ఛైర్మన్
(b) మొదటి ప్రధాన ఎన్నికల కమీషనర్
(c) మొదటి భారత ప్రధాన న్యాయమూర్తి
(d) భారత ప్రణాళికా సంఘము మొదటి అధ్యక్షుడు
జాబితా-II
(i) హెచ్.జె. కానియ
(ii) జవహర్లాల్ నెహ్రూ
(iii) కె.సి. నియోగి
(iv) సుకుమార్ సేన్
105. క్రింది ప్రవచనములను పరిగణింపుము
(a) కాలుష్య రుసుమును విధించిన మొదటి రాష్ట్రము ఢిల్లీ
(b) కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి వ్యయములో రక్షణ వ్యయం ఒక భాగం
(c) వస్తువుల ఉత్పత్తిపై విధించే పన్నును ఎక్సైజ్ సుంకము అంటారు
వీటిలో ఏ ప్రవచనం/ప్రవచనాలు ఒప్పు?
106. ప్రతిపాదన (A): జనాభాలో పనిచేయగల వయస్సు ఉన్నవారి వాటా పెరగటం మూలంగా ఆర్థిక వృద్ధిరేటు పెరగటాన్ని ''జనాభా సంబంధ ప్రయోజనం'' అంటారు
కారణం (R): ఉపాధి కల్పించని ఆర్థిక వృద్ధి సామాజిక అశాంతికి దారితీస్తుంది
107. ప్రతిపాదన (A): సమాఖ్య దేశంలో పౌరులు సాధారణంగా ద్వంద్వ పౌరసత్వమును కలిగి ఉంటారు. భారతదేశం ఒక సమాఖ్య దేశమైనప్పటికి, భారత పౌరులు ఏక పౌరసత్వం కలిగి ఉంటారు.
కారణం (R): విచ్ఛిన్నకర శక్తులను అణచివేసి జాతీయ సమైక్యతను కాపాడే లక్ష్యంలో భారతదేశం ఏక పౌరసత్వ విధానాన్ని అనుసరిస్తుంది.
108. క్రింది ప్రవచనములలో ఏది తప్పు
109. క్రింది వాటిని జతపరచుము
జాబితా-I
(a) సర్వోదయ ప్రణాళిక, 1950
(b) బొంబాయి ప్రణాళిక, 1944
(c) ప్రజా ప్రణాళిక, 1944
(d) గాంధీయత ప్రణాళిక, 1944
జాబితా-II
(i) పారిశ్రామిక వేత్తలు
(ii) శ్రీమన్నారాయణ అగర్వాల్
(iii) జయప్రకాశ్ నారాయణ
(iv) ఎమ్.ఎన్. రాయ్
110. ఈ క్రింది వానిని జతపర్చండి
జాబితా-I
(a) సామాజిక ప్రగతి సూచిక
(b) స్థూల జాతీయ సంతోష సూచిక
(c) మానవ అభివృద్ధి సూచిక
(d) భౌతిక మన్నిక జీవన సూచిక
జాబితా-II
(i) తలసరి స్థూల దేశీయోత్పత్తి
(ii) శిశు మరణాల రేటు
(iii) మానవ ప్రాథమిక అవసరాలు
(iv) ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక అంశాలు
111. క్రింది ప్రవచనములను చదువుము
(a) ఆంధ్ర ప్రదేశ్ మరియు గుజరాత్ రాష్ట్రాలు సమాన సంఖ్యలో రాజ్య సభ స్థానములు కలిగియున్నవి
(b) రాజస్థాన్ మరియు ఒడిషా రాష్ట్రాలు సమాన సంఖ్యలో లోక్ సభ స్థానములు కలిగియున్నవి
(c) లోక్ సభ ఉప సభాపతిని సభాపతి నియమించును
సరియైన సమాధానము
112. క్రింది వాటిలో గణతంత్ర దినోత్సవం 2016 కవాతులో పాల్గొన్నవారు ఎవరు?
113. క్రింది వానిలో సరియైన జతలు ఏవి?
పుస్తకము – రచయిత
(a) ది ఇమామ్ మరియు ది ఇండియన్ – అమితావ్ ఘోష్
(b) ది షాడో లైన్స్ – చేతన్ భగత్
(c) టు లైవ్స్ – విక్రమ్ సేథ్
(d) వార్ టాక్ – అమితాబ్ భట్టాచార్య
114. క్రింది ప్రవచనములలో సరియైనది కానిది ఏది?
115. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (NJAC) చట్టము చెల్లదని తీర్పునిచ్చిన రాజ్యాంగ ధర్మాసనము అధ్యక్షుడు
116. క్రింది వారిలో రాజ్య సభ సభ్యులుగా నియమించబడినవారు ఎవరు?
117. క్రింది ప్రవచనములను చదవండి
(A) ప్రతిపక్ష నాయకుడిని స్పీకర్ నియమించును
(B) లోక్ సభలో ఇద్దరు సభ్యులను స్పీకర్ నియమించును
(C) స్పీకర్ తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించును
పై ప్రవచనాలలో ఏది/ఏవి తప్పు
118. ఈ క్రింది వానిని జతపరచండి.
జాబితా-I
కేంద్ర మంత్రులు (2016, ఫిబ్రవరి)
(a) అరుణ్ జైట్లీ
(b) అనంత కుమార్
(c) చౌదరి బీరేంద్ర సింగ్
(d) థావర్ చాంద్ గెహ్లాట్
జాబితా-II
శాఖలు
(i) పంచాయితీ రాజ్
(ii) సామాజిక న్యాయము మరియు సాధికారత
(iii) సమాచార మరియు ప్రసారము
(iv) రసాయనాలు మరియు ఎరువులు
119. క్రింది వానిని జతపరచుము:
జాబితా-I
(రాష్ట్రం)
(a) గోవా
(b) నాగాలాండ్
(c) మిజోరం
(d) ఉత్తరాఖండ్
జాబితా-II
(ముఖ్య మంత్రి)
(i) హరీష్ రావత్
(ii) లాల్ తన్హవాలా
(iii) లక్ష్మీకాంత్ పర్సేకర్
(iv) టి.ఆర్. జెలాంగ్
120. క్రింది వారిలో లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నవారు/ఉంటున్నవారు
(A) సోమనాథ్ ఛటర్జీ, రబీరే, మనోహర్ జోషి
(B) పి.ఎ. సంగ్మా, మురళి మనోహర్ జోషి, అర్జున్ సింగ్
(C) శ్రీమతి సుమిత్ర మహాజన్, శ్రీమతి మీరాకుమార్, శివరాజ్ పాటిల్
(D) బలరాంజాకర్, జైరాం రమేష్, కె.ఎస్. హెగ్డే
121. క్రింది ప్రవచనములను చదవండి
(a) ప్రస్తుత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి
(b) అటార్నీ జనరల్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి నియమించును
(c) అటార్నీ జనరల్ పదవి కాలము ఆరు సంవత్సరములు
పైన ఇవ్వబడిన ప్రవచనములలో ఏది/ఏవి సరైనవి.
122. బ్రిక్స్ (BRICS) ఆరవ శిఖరాగ్ర సమావేశంలో సభ్య దేశాలు ఏవి?
123. క్రింది ప్రవచనములలో ఏది/ఏవి ఒప్పు?
(A) 14వ ఆర్థిక సంఘము అధ్యక్షుడు డాక్టర్ వై.వి. రెడ్డి
(B) 14వ ఆర్థిక సంఘము రాష్ట్రాలకు 42% నిధుల కేటాయింపును సిఫారసు చేసినది
(C) ఆర్థిక సంఘమును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నియమించును
124. ప్రతిపాదన (A): ప్రజా ప్రయోజనాల వ్యాజ్యము ప్రజల ప్రయోజనాలను పరిరక్షించును.
కారణం (R): ప్రజా ప్రయోజనాల వ్యాజ్యములను అనుమతించుటకు ఉన్నత న్యాయ స్థానములకు విచక్షణ అధికారము కలదు.
125. ఏ సంఘటన తర్వాత భారత పార్లమెంట్ నిర్భయ చట్టాన్ని ఆమోదించింది?
126. గూగుల్ భాగస్వామ్యముతో రైల్ టెల్ వారు ఉచిత వై-ఫై సేవలను మొట్టమొదటి సారిగా ప్రవేశపెట్టిన రైల్వేస్టేషన్ ఎక్కడ ఉంది?
127. పిలాటస్ పిసి-7 శిక్షణ విమానాన్ని భారతదేశము ఏ దేశం నుంచి కొన్నది
128. 2014 ప్రపంచ పురుషుల ఫుట్‌బాల్ కప్‌ను గెలుచుకున్న దేశం?
129. అత్యధిక ఓటర్ల సంఖ్య ఉన్న లోక్‌సభ నియోజకవర్గము ఉన్న రాష్ట్రము
130. 2015 ఫిఫా మహిళా ప్రపంచ కప్‌ను గెలుపొందిన దేశము
131. క్రింది ప్రవచనములు ఏది/ఏవి సరియైనవి
(A) ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యములను ఆమోదించినది
(B) బాన్‌కి మూన్, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌గా రెండవసారి పదవిలో ఉన్నారు
(C) ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌గా రెండుసార్లు పదవి నిర్వహించినది కేవలము బాన్‌కీ మూన్ మాత్రమే
132. పులిట్జర్ బహుమతి పొందిన భారతీయులు
133. క్రింది పేర్కొన్న జతలలో సరియైనవి ఏవి?
పుస్తకము – రచయిత
(A) డా విన్సి కోడ్ – డాన్ బ్రౌన్
(B) ది లో లాండ్ – చేతన్ భగత్
(C) వెన్ గాడ్ ఈజ్ ఎ ట్రావెలర్ – అరుంధతి సుబ్రహ్మణ్యమ్
(D) స్పీడ్ పోస్ట్ – తస్లీమా నస్రీన్
134. క్రింది ప్రవచనములలో ఏది/ఏవి సరియైనది/వి కావు?
(A) జాతీయ వెనుకబడిన తరగతుల కమీషన్ రాజ్యాంగ సంస్థ
(B) జాతీయ మైనారిటి కమీషన్ రాజ్యాంగ సంస్థ
(C) జాతీయ మహిళ కమీషన్ చట్టబద్ధ సంస్థ
(D) జాతీయ షెడ్యూల్ తెగల కమీషన్ రాజ్యాంగ సంస్థ
135. క్రింది ప్రవచనములలో సరియైనది/వి ఏవి?
(A) అరబ్ వసంత ఉద్యమము టునీషియాలో మొదలైనది
(B) అరబ్ వసంత ఉద్యమమునకు సౌదీ అరేబియా నాయకత్వము వహించినది
(C) అరబ్ వసంత ఉద్యమము ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ మరియు ఇరాన్లలో వ్యాప్తి చెందినది
(D) అరబ్ వసంత ఉద్యమము ఒక పుష్పసాగు ఉద్యమము
136. WALK, TRIM మరియు MAY కోడ్ (Code)లో 8243, 6517 మరియు 729గా వ్రాసినచో, కోడ్‌లో RAILWAY :
137. SURESH కోడ్ (Code)లో TWSGTJగా వ్రాసినచో కోడ్‌లో PRINCE :
138. ఒక కోడ్‌లో GNBJDX అనేది HOCKEY అనే పదాన్ని సూచిస్తే అదే కోడ్‌లో BQHBJDS సూచించే పదం:
139. ఒక కోడ్‌లో POLICE ని SROLFH గా రాస్తే అదే కోడ్‌లో STATION ని రాసే పదం:
140. శ్రేఢి 2, 11, 53, 209, 623, (?) లో, గుర్తు (?) లో వచ్చే సరియైన సంఖ్యను ఎంచండి.
141. క్రింది ఖాళీని సరియైన సంఖ్యతో పూరించండి.
2, 6, 30, ____, 1890, 20790; 6, 7, 15, 42, ____, 231.
142. అనుక్రమము 1, 7, 25, 79, ___, 727 మరియు 1, 6, 15, ___, 45, 66, 91 లోని ఖాళీలలో సరిపోయే సంఖ్య
143. అనుక్రమము 3, 7, 13, 21, 31, ___, 57 లోని ఖాళీలో సరిపోయే సంఖ్య:
144. అవరోహణ క్రమంలో విద్యార్థుల ఎత్తులు:
145. D ఏ ఆట ఆడుతాడు?
146. Volleyball ఎవరు ఆడుతారు?
147. E ఏ ఆట ఆడుతాడు?
148. క్రింది పటాలను గమనించండి:
త్రిభుజం 1: ఎడమ-పైన 3, కుడి-పైన 7, క్రింద 9
త్రిభుజం 2: ఎడమ-పైన 8, కుడి-పైన 4, క్రింద 10.5
త్రిభుజం 3: ఎడమ-పైన 13, కుడి-పైన 1, క్రింద 12
త్రిభుజం 4: ఎడమ-పైన 18, కుడి-పైన A, క్రింద B
అప్పుడు, (A, B) =
149. క్రింది పటాలను జాగ్రత్తగా గమనించండి. ఖాళీని సరియైన ఎంపికతో పూరించండి.
త్రిభుజం 1: పైన 2, కింద-ఎడమ 3, కింద-కుడి 4, మధ్య 29
త్రిభుజం 2: పైన 2, కింద-ఎడమ 1, కింద-కుడి 3, మధ్య 14
త్రిభుజం 3: పైన 1, కింద-ఎడమ 4, కింద-కుడి 5, మధ్య 42
త్రిభుజం 4: పైన 2, కింద-ఎడమ 3, కింద-కుడి 4, మధ్య ?
150. క్రింది పటాలను పరిశీలించండి. ఖాళీని సరియైన సంఖ్యతో పూరించండి.
పెట్టె 1: –1, 3 / 10, 2
పెట్టె 2: 3, 5 / 34, 8
పెట్టె 3: 2, 5 / 29, 7
పెట్టె 4: –3, –2 / ?, –5
సరియైన సంఖ్య
151. లీప్ సంవత్సరం కాని ఫిబ్రవరి (February) 1వ తేదీ ఆదివారము (Sunday) అయితే 31 మే (May)
152. ఒక లీప్పు సంవత్సరములో జనవరి 26 ఆదివారమైతే ఆ సంవత్సరం ఆగష్టు 15వ తేదీన వచ్చేవారం
153. ఒక సంఘము యొక్క సమావేశము జరుగుతోంది. ఒక సభ్యుడు సమావేశము జరిగే ప్రదేశమునకు 9.35 A.Mకు 20 నిమిషములు ముందుగా చేరినాడు, రెండవ సభ్యుడు మొదటి సభ్యుడి కంటే అర్థగంట లేటుగా వచ్చాడు. రెండవ సభ్యుడు సమావేశమునకు 40 నిమిషములు లేటుగా వచ్చినచో సమావేశము ప్రారంభము అయిన సమయము
154. ముగ్గురు పనివాళ్ళు A, B మరియు C ఒక ఇంటికి రంగు వేస్తున్నారు. A, B మరియు C ముగ్గురు కలిసి ఆ పనిని పూర్తిచేయడానికి ఎన్ని రోజులు కావాలో కనుక్కోవాలి.
క్రింద ఇచ్చిన ప్రవచనములు చూడండి:
(I) A మరియు B కలిసి 20 రోజులలో పని పూర్తి చేయగలరు
(II) B మరియు C కలిసి 16 రోజులలో పని పూర్తి చేయగలరు
(III) A మరియు C కలిసి 15 రోజులలో పని పూర్తి చేయగలరు
అప్పుడు
155. పొడగరి కాని నిక్కచ్చియైన IAS అధికారుల సంఖ్య
156. IAS అధికారులు కాని, పొడగరి మరియు నిక్కచ్చియైన అధికారుల సంఖ్య
157. P, Q, R, S అనే నాలుగు వస్తువులలో అతి బరువైన వస్తువును కనుక్కోవాలి. క్రింద ఇచ్చిన ప్రవచనములు చూడండి
I. P కన్నా Q బరువు ఎక్కువ ఉంది, కాని Q బరువు S బరువు కన్నా తక్కువ ఉంది
II. Q కన్నా R బరువు ఎక్కువ ఉంది
అప్పుడు
158. ఐదుగురు వ్యక్తులు A, B, C, D, E ఒక బల్ల చుట్టూ కూర్చున్నారు. అందులో A, E ఒక వ్యాసపు అంచుల్లో ఉండగా, C, D లు Aకి ఇరుప్రక్కల ఉన్నారు. Aకి కుడి ప్రక్కన ఉన్న ఒకే వ్యక్తి D అయితే వాళ్ళ కూర్చున్న క్రమం
159. రెండు ఏక కేంద్రీయ వృత్తముల వ్యాసములు వరుసగా 10 సెం.మీ మరియు 16 సెం.మీ. ఆ వృత్తముల మధ్య ప్రదేశ వైశాల్యము (చదరపు సెం.మీలలో)
160. ఒక కంట్రాక్టరు రెండు ఇళ్ళను, ఒక్కొక్కటి రూ. 20,00,000/- చొప్పున అమ్మినాడు. ఒక ఇంటి మీద అతనికి 20% లాభము మరియు రెండవ ఇంటి మీద అతనికి 20% నష్టము వచ్చినది. అమ్మకములో అతనికి వచ్చిన లాభ శాతము లేక నష్ట శాతము
161. నానాఘాట్ శాసనాన్ని వేయించింది
162. శాతవాహనుల కాలంలో ఈ క్రింద పేర్కొన్న ఏ రేవు పట్టణం ప్రముఖమైనది
163. ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి:
164. ఈ క్రింది వాటిని జతపరచండి:
(A) నేలకొండపల్లి
(B) కొలనుపాక
(C) అలంపూర్
(D) కన్హేరి
(i) జైన కేంద్రం
(ii) బౌద్ధ స్తూపము
(iii) హిందూ దేవాలయములు
(iv) బౌద్ధ చైత్యము
165. ప్రతిపాదన (A): శాతవాహనుల కాలంలో బౌద్ధమతం ఉచ్ఛ దశకు చేరింది.
కారణం (R): శాతవాహనుల కాలంనాటి చిత్ర లేఖనాలు అజంతా గుహలలో కలవు.
166. క్రింది వాటిలో ఏ వివరణ సరైనది కాదు?
167. కాకతీయుల కాలంలో రూపుదిద్దుకున్న నృత్యం ఏది?
168. ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి:
169. సమ్మక్క-సారక్కలు క్రింద పేర్కొన్న ఏ రాజుతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయినారు?
170. ఈ క్రింది వానిని జతపరచుము:
జాబితా-I
(A) వేయి స్థంభాలగుడి
(B) రుద్రమదేవి
(C) రుద్రదేవుడు
(D) జాయప
జాబితా-II
(i) నృత్య రత్నావళి
(ii) మొట్టమొదటి సార్వభౌమ కాకతీయ రాజు
(iii) నాయంకర విధానం
(iv) హనుమకొండ
171. ''కుతుబ్‌షాహిల కాలంలో సతి ఆచారం అమలులో ఉండని'' పేర్కొన్న విదేశీయ యాత్రికుడు
172. ఈ క్రింది వాటిని జతపరచుము:
జాబితా-I
(A) మహమ్మద్ కులీ
(B) జంషీద్
(C) ఇబ్రహీం కుతుబ్‌షా
(D) మహమ్మద్ కుతుబ్‌షా
జాబితా-II
(i) 1612
(ii) 1550
(iii) 1543
(iv) 1518
173. కుతుబ్‌షాహీలు ఏ తెగకు చెందినవారు?
174. మహమ్మద్ కులీ కుతుబ్‌షా రచనలు ఏ పేరుతో ముద్రించబడినవి
175. ప్రతిపాదన (A): కుతుబ్షాహి రాజ్యం అన్ని రంగాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందింది.
కారణం (R): వజ్రపు గనులు కుతుబ్‌షాహీలకు మంచి ఆదాయాన్ని ఇచ్చాయి.
176. నిజాం-ఉల్-ముల్క్ అసలు పేరు:
177. ప్రతిపాదన (A): మీర్ మహాబూబ్ అలీ ఖాన్ ప్రజారంజక పాలకుడు.
కారణం (R): మీర్ మహాబూబ్ అలీ ఖాన్ కాలంలో హైదరాబాద్ రాజ్యంలో రైల్వేలు శీఘ్రంగా అభివృద్ధి చెందాయి.
178. హైదరాబాద్ రాష్ట్రంలో ఏ సంవత్సరంలో పర్షియన్ స్థానంలో ఉర్దు అధికార భాషగా ప్రవేశపెట్టబడింది?
179. క్రింది వాటిని జతపరచుము:
జాబితా-I
(A) శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయము
(B) శ్రీరాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయము
(C) ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయము
(D) విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి
జాబితా-II
(i) 1901
(ii) 1904
(iii) 1905
(iv) 1906
180. క్రింది వాటిని జతపరచుము:
జాబితా-I
(A) హిందూ సోషల్ క్లబ్
(B) హ్యుమానిటేరియన్ లీగ్
(C) ఆది-హిందూ లైబ్రరీ
(D) రైతు గ్రంథాలయము
జాబితా-II
(i) రాయ్ బాల్ ముకుంద్
(ii) రాజా మురళిమనోహర్
(iii) రావి నారాయణ రెడ్డి
(iv) B.S. వెంక్ట్రావు
181. క్రింది ప్రవచనములలో ఏది సరైనది కాదు
182. జల్, జంగల్, జమీన్ నినాదాన్ని ఇచ్చింది ఎవరు?
183. నిజాం రాజ్యంలో 'హాలిసిక్కా రూపాయిని' ఎవరు ప్రవేశపెట్టినారు?
184. 20వ శతాబ్దములో హైదరాబాద్ రాష్ట్రములో అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన చీఫ్ ఇంజనీర్ ఎవరు?
185. ఈ క్రింది వానిలో ఎవరు కోహినూరు వజ్రాన్ని షాజహాన్‌కు బహుకరించారు.
186. కొమరం భీమ్ ఎక్కడ జన్మించాడు?
187. ఈ క్రింది వాటిని జతపరచుము
జాబితా-I
(A) రఘునాథరావు
(B) భార్గవ కమీషన్
(C) అరువముడి అయ్యంగార్ కమిటీ
(D) కేశవ అయ్యంగార్ కమిటీ
జాబితా-II
(i) ఎదురు కాల్పుల మరణాలు
(ii) జోగిని సమస్యలు
(iii) ఆర్థిక వ్యవహారములపై విచారణ
(iv) రాజకీయ సంస్కరణములు
188. ఈ క్రింది వాటిని జతపరచుము:
జాబితా-I
(A) నీలగిరి పత్రిక
(B) రయ్యత్
(C) జనధర్మ
(D) గోల్కొండ పత్రిక
జాబితా-II
(i) సురవరం ప్రతాప రెడ్డి
(ii) షబ్నవీస్ నరసింహ రావు
(iii) మందుముల నరసింగ రావు
(iv) M. శ్రీనివాసాచార్య
189. 'విశ్వగృహ పరిచారిక సమ్మేళనం' స్థాపించింది
190. తెలంగాణ రీజనల్ కమిటీ తొలి అధ్యక్షుడు ఎవరు?
191. గిరిజనుల భూముల రక్షణకై చేయబడిన చట్టాన్ని ఏ పేరుతో వ్యవహరిస్తున్నారు
192. 'రాజోలి బండ డైవర్షన్ స్కీమ్' ఏ నదిపై నిర్మించారు?
193. సరి కాని జతను గుర్తించుము:
194. ''జై బోలో తెలంగాణ'' సినిమా దర్శకుని పేరు?
195. క్రింద పేర్కొన్నబడినవారిలో ఎవరు శ్రీకృష్ణ కమిటి సభ్యులు కారు
196. ప్రతిపాదన (A): హైదరాబాద్ రాష్ట్రంలో 20వ శతాబ్దం తొలి పాదంలో అనేక పత్రికలు ప్రారంభమైనాయి.
కారణం (R): హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజలను చైతన్య పరచడంలో ప్రెస్ క్రియాశీలక పాత్రను పోషించింది.
197. సరైన జతను గుర్తించండి:
198. క్రింది వాటిని జతపరచుము:
జాబితా-I
(A) తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్
(B) తెలంగాణ స్టూడెంట్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్
(C) సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్
(D) తెలంగాణ ప్రగతి వేదిక
జాబితా-II
(i) రాపోలు ఆనంద భాస్కర్
(ii) తెలంగాణ ప్రభాకర్
(iii) K. మనోహర్ రెడ్డి
(iv) మల్లేపల్లి లక్ష్మయ్య
199. 'తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీతో' భాగస్వామ్యము కాని రాజకీయ పార్టీ ఏది?
200. ప్రతిపాదన (A): మొదటి సాలార్జంగ్ 1868లో మలిక్కి ఉద్యోగాలలో ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చెను.
కారణం (R): స్థానికేతరులను ఉద్యోగములలో నియమించటం వల్ల మలిక్కిలలో అసంతృప్తి ప్రబలింది.