← ప్రశ్నపత్రాలు
6. TS పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ - 30 ఏప్రిల్ 2023
200 ప్రశ్నలు 0 of 200 answered
Text size
Filter
Jump to
Purchase this subject for 45 days of unlimited access.
View plansMock Test Starting…
00:00
Question 1 of 1
Exit mock test? Your progress on this attempt will be lost.
1. Fill in the blank with an appropriate form of the verb given in brackets to make it a meaningful sentence.
She ___ (hand) me a picture of sloppily drawn birthday cake last year.
2. Fill in the blank with an appropriate form of the verb given in brackets to make it a meaningful sentence.
I ___ (pull) out my calculator before I added up all the money.
3. Which of the following sentences is incorrect with reference to reported speech?
4. Identify the correct passive form of the verb from the options given below.
A nation ___ (hold) together by shared beliefs and shared attitudes.
5. Fill in the blank with an appropriate verb that agrees with the subject in the following sentence.
One of the most important secrets to success ___, instead of being against something, be for something.
6. Which of the following words has an incorrect spelling?
7. Identify the grammatically incorrect sentence in passive voice from the options given below.
8. Fill in the blank with correct preposition in the following sentence.
Great innovators believe that logic and imagination shake hands ___ each other.
9. What is the meaning of the idiom 'turn the clock back'?
10. Identify the correct form of the following sentence to be converted to direct speech.
'They told us that they would start the admission process the following day.'
11. Fill in the blank with an appropriate article in the following sentence.
Past glory and education don't count for much. We have to continuously sharpen ___ axe.
12. Identify the correct idiom which means 'accurate information'?
13. Fill in the blank with correct preposition in the following sentence.
He gaped ___ some developed countries in wonder for their vast materialistic progress.
14. Fill in the blank with an appropriate article in the following sentence.
People without conviction do not take ___ stand.
15. Fill in the blank with an appropriate form of the verb given in brackets to make it a meaningful sentence.
Unless you ___ (read) today, you cannot be perfect person tomorrow.
16. Fill in the blank with an appropriate pronoun that agrees with the subject in the following sentence.
The biggest achievement of Digital India has been ___ tremendous success in ensuring digital inclusion for all in India.
17. Identify the correct synonym of the underlined word in the following sentence.
'Illustrious people seem to light up everything around them.'
18. Fill in the blank with correct preposition in the following sentence.
Steve Jobs said, "Innovation distinguishes ___ a leader and a follower."
19. Identify the correct antonym of the underlined word in the following sentence.
He was fishing for a squid with pals in shallow water.
20. Identify the word with correct spelling from the options given below.
21. Read the passage given below and answer the question.
People wait for the rains since they can ___ in it.
22. Besides maintaining kitchen hygiene we should ___ so as to keep us disease free in the rainy season.
23. After getting wet in rains we should put on dry clothes ___.
24. The passage suggests that small children should wash their hands ___ in the rainy season since they have lower immunity.
25. The word in the passage which means the same as 'prone and vulnerable' is ___.
26. A, B, C, D వరుసగా నలుగురు విద్యార్థుల మార్కులను సూచిస్తాయనుకుందాం. A, B, C ల యొక్క సగటు 10 1/3; B, C, D ల యొక్క సగటు 13 2/3; C, D, A ల యొక్క సగటు 12 1/3; మరియు D, A, B ల యొక్క సగటు 11 2/3 అయితే 5(C-B) =
27. n ఒక ధన పూర్ణాంకం మరియు n < 193. అనుకుందాం. n మరియు 193 లు సహప్రధాన సంఖ్యలయితే n కు పొందుపడు అన్ని విలువల యొక్క మొత్తం :
28. ఒక దుకాణదారుడు ఒక నిర్ధిష్ట నెలలో అతనికి వచ్చిన లాభంలో 20% అతని వద్ద గల పనివారికి ఇచ్చే వేతనానికి ఖర్చు చేశాడు. లాభంలో మిగిలిన దానిలో 10% శాతాన్ని కొట్టు బాడుగకు మరియు 40% శాతాన్ని అతని కుటుంబ ఖర్చులకు గానూ వెచ్చించాడు. ఆ తరువాత మిగిలిన 50,000 రూపాయలను బ్యాంకులో పొదుపు చేశాడు. అయితే అతడు వేతనాలకు మరియు బాడుగకు వెచ్చించిన మొత్తం సొమ్ము (రూపాయలలో) :
29. ఒకవేళ a:b = 3:4, b:c = 4:5, a+2b = 55 మరియు 3b-c = 35 అయితే 3a+2b-c =
30. రెండు ప్రదేశాలు A మరియు B ల మధ్య దూరం 480 కి.మీ.లు. ఒక కారు A నుండి బయలుదేరింది; కానీ రోడ్ ట్రాఫిక్ వల్ల దాని వేగం దాని సాధారణ వేగం కంటే గంటకు 20 కి.మీ.లు చొప్పున తగ్గింది మరియు అది గమ్య స్థానం B ని చేరే సమయం సాధారణ సమయం కంటే 2 గంటలు పెరిగింది. అయితే పూర్తి ప్రయాణానికి పట్టే సాధారణ కాల వ్యవధి (గంటలలో) :
31. 1887 సెప్టెంబర్ 5న వారంలోని ఏ రోజైనదో ఆ రోజు :
32. 5,25,000 రూపాయల పెట్టుబడితో A ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. వ్యాపారాన్ని ప్రారంభించినప్పటి నుండి 5వ మాసాంతంలో 4,32,000 రూపాయల పెట్టుబడితో A తో B చేరాడు మరియు వ్యాపార ప్రారంభం నుండి 8వ మాసాంతంలో 6,30,000 రూపాయల పెట్టుబడితో A మరియు B లతో C చేరాడు. సంవత్సరాంతం ఆర్జించిన లాభంలో C వాటా 50,000 రూపాయలు మరియు A వాటా B వాటా కంటే x రూపాయలు ఎక్కువైతే, x =
33. A ఒక పనిని 6 రోజులలో చేయగలడు మరియు B అదే పనిని 9 రోజులలో చేయగలడు. A మరియు B లు మూడవ వ్యక్తి C తో కలిసి అదే పనిని 3 రోజులలో పూర్తి చేయగలరు. ఆ పనికి అయ్యే మొత్తం వేతనాలు 24,000 రూపాయలైతే C యొక్క వేతనం (రూపాయలలో) :
34. ఒక వృత్తాకారపు స్థంభం చుట్టూ ఒక దీర్ఘ చతురస్రాకారపు బాటను దాని లోపలి భుజము ప్రతి స్థలాన్ని ఒక బిందువున వద్ద తాకేటట్టు 5 మీటర్ల వెడల్పుతో, ఒక బాటను నిర్మించారు. స్థలం యొక్క వైశాల్యం 61,600 చ.సెం.మీ. మీటర్లుగా ఉండి, బాటను నిర్మించడానికి ప్రతి మీటరుకు 100 రూపాయలు ఖర్చు అయితే, బాటను నిర్మించడానికి కావలసిన మొత్తం (రూపాయలలో) :
35. 75-32+23×570÷15 యొక్క 2+(37-7+5) =
36. A, B, C, D నలుగురు వ్యక్తులు. ఒక పురాతనవస్తువును B కు A, C కు B మరియు D కు C విక్రయించారు. D కొనేటప్పటికి మొత్తం మీద ఆ పురావస్తువు యొక్క ధర 80% పెరిగింది. 25% లాభాన్ని A మరియు 20% లాభాన్ని B పొందారు. అయితే C పొందిన లాభం :
37. A యొక్క ప్రస్తుత వయస్సు B యొక్క ప్రస్తుత వయస్సుకు మూడు రెట్లు. 5 సంవత్సరాల క్రితం A యొక్క వయస్సు అప్పటి B యొక్క వయస్సు వర్గానికి సమానం. కాని ఇప్పటి నుండి పది సంవత్సరాల తర్వాత, A యొక్క వయస్సు అప్పటి B యొక్క వయస్సుకు రెండు రెట్లు. అయితే A యొక్క ప్రస్తుత వయస్సు (సంవత్సరాలలో) :
38. ఒక వస్తువును దాని ప్రకటిత ధరపై 25% తగ్గింపుతో అమ్మితే ఒక వ్యాపారికి 12 1/2% లాభం వస్తుంది. దాని ప్రకటిత ధరపై ఇచ్చే తగ్గింపు 30% అయితే దాని కొన్న ధరపై వచ్చే లాభ శాతం :
39. ఒక నిర్ధిష్ట సొమ్ముపై సాలీనా 6% చొప్పున 3 సంవత్సరాలకు బారువడ్డీ 22,500 రూపాయలు మరియు అదే సొమ్ముపై సాలీనా R% చొప్పున 4 సంవత్సరాలకు బారువడ్డీ 40,000 రూపాయలు. అయితే అదే సొమ్ముపై సాలీనా 7% చొప్పున R సంవత్సరాలకు బారువడ్డీ (రూపాయలలో) :
40. 7 సెం.మీ.ల అంతర వ్యాసార్థం గల ఒక స్థూపాకార పాత్ర, ఒక్కొక్కటి 7 సెం.మీ. వ్యాసార్థం గల 6 ఘన గోళాకార బంతులను కలిగి ఉంది. అత్యంత ఎగువన ఉన్న బంతి ఆ పాత్ర యొక్క పైమూతను స్పృశిస్తే, అప్పుడు ఆ పాత్రలో ఖాళీగా ఉన్న ప్రాంతం యొక్క పరిమాణం (ఘ.సెం.మీ.లలో) :
41. r1, r2 వ్యాసార్థాలుగా గల రెండు గొట్టాలు ఒక ఖాళీ తొట్టిని వరుసగా t1 నిమిషాలు మరియు t2 నిమిషాలలో నింపగలిగి ఉండి, నీటి ప్రవాహ వేగం రెండు గొట్టాలలోనూ ఒకేలా ఉంటే అప్పుడు t1r1² = t2r2² అని ఇవ్వబడినది. వరుసగా 1 సెం.మీ., 1 1/2 సెం.మీ. మరియు 2 సెం.మీ. వ్యాసార్థాలు గల మూడు కుళాయిలు ఉన్నాయి. వాటి నుండి వచ్చే నీటి ప్రవాహం యొక్క వేగం ఒకే విధంగా ఉంటుంది. వాటిలో అన్నిటికంటే ఎక్కువ వెడల్పు గల కుళాయి ఒక ఖాళీ తొట్టిని 45 నిమిషాలలో నింపగలదు. అన్ని కుళాయిలను ఒకేసారి తెరిచినట్లైతే, ఎన్ని గంటలలో ఆ ఖాళీ తొట్టి నిండుతుంది?
42. 546, 1155, 462 మరియు 1365 ల యొక్క గ.సా.భా. H మరియు 252, 504, 108 ల యొక్క క.సా.గు. L అయితే L/H =
43. ఒక రైలు సాధారణ వేగంతో ఒక ప్లాట్‌ఫాంను 18 సెకండ్లలో దాటగలదు. దాని సాధారణ వేగాన్ని గంటకు 15 కి.మీ. చొప్పున పెంచితే అదే ప్లాట్‌ఫాంను ఆ రైలు 15 సెకండ్లలో దాటగలదు. ఆ ప్లాట్‌ఫాం యొక్క పొడవు రైలు పొడవుకు 1 1/2 రెట్లయితే, రైలు యొక్క సాధారణ వేగం (గంటకు కి.మీ.లలో) :
44. x = 3080+3080+3080+...to ∞ యొక్క వర్గమూలం, y = 200√200√200...to ∞ మరియు x+y=z, అయితే √z√z√z =
45. ప్రతి 24 గంటల వ్యవధిలో ఒక గడియారం 5 నిమిషాలు కోల్పోతుంది మరియు అదే వ్యవధిలో మరొక గడియారం 3 నిమిషాలు లాభ పడుతుంది. రెండు గడియారాలు ఒక నిర్ధిష్ట సమయంలో ఒకే సమయం 't' ని చూపిస్తే, సమీప భవిష్యత్తులో ఆ రెండు గడియారాలు ఏ సమయ వ్యవధిలో (రోజులలో) మళ్ళీ అదే సమయం 't' ని చూపుతాయి?
46. క్రింది వాటిలో 7280 యొక్క భాజకం :
47. సాలీనా చక్రవడ్డీకి ఇవ్వబడిన కొంత సొమ్ము 2 సంవత్సరాలలో 7680 రూపాయల మొత్తంగానూ మరియు 3 సంవత్సరాలలో 8192 రూపాయల మొత్తంగానూ అయ్యింది. అయితే పెట్టుబడిగా పెట్టిన సొమ్ము (రూపాయలలో) :
48. 8 మంది పురుషులు ఒక పనిని 12 రోజులలో పూర్తి చేయగలరు; అదే పనిని 9 మంది స్త్రీలు 16 రోజులలో చేయగలరు; అదే పనిని 12 మంది పిల్లలు 24 రోజులలో పూర్తి చేయగలరు. 6 మంది పురుషులు, 12 మంది స్త్రీలు మరియు 18 మంది పిల్లలు ఆ పనిని ప్రారంభించి, వారందరూ కలిసి 3 రోజులు పని చేశారు. మిగిలిన పనిని 4వ రోజు కేవలం స్త్రీలు మాత్రమే పూర్తి చేయవలసి వస్తే, అవసరమయ్యే స్త్రీల సంఖ్య :
49. x, y, z లు ఏవైనా మూడు శూన్యేతర వాస్తవ సంఖ్యలు x⁴-y²=z², y⁴-z²=x² మరియు z⁴-x²=y² అయ్యేటట్టు ఉన్న ఏవైనా మూడు శూన్యేతర వాస్తవ సంఖ్యలు x, y, z లు అయితే, (x²+1)⁻¹+(y²+1)⁻¹+(z²+1)⁻¹ =
50. 0.7̄ ను దాని చేతనే గుణించగా వచ్చిన దానిని, 0.8̄ యొక్క వ్యుత్క్రమంలో 2/9వ భాగంచే భాగించారు. ఆ విధంగా వచ్చిన విలువ x అయితే 9√x =
51. కాకతీయుల పతనానంతరము బస్తర్ జిల్లాలో నివాసమేర్పరచుకున్న రెండవ ప్రతాపరుద్రుని సోదరుడు ఎవరు?
52. ఢిల్లీ సుల్తానుల దర్బారు లో మొట్టమొదటి సారి నౌరోజ్ పండుగను ప్రవేశపెట్టిన సుల్తాను ఎవరు?
53. మార్కెట్ శక్తుల యొక్క డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా నిర్ణయించు మార్పిడి ధర ___.
54. హర్షవర్ధనునిచే రచించబడిన నాటకములను గుర్తించుము.
55. ఈ క్రింది ఖనిజాలలో దేనిని 100°C ఉష్ణోగ్రతకు వేడి చేయడం ద్వారా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (PoP) తయారు చేయబడుతుంది?
56. క్రీ.శ. 1576 సంవత్సరంలో హల్దీఘాటు యుద్ధంలో రాణా ప్రతాప్ సింగ్ కు సహాయపడిన ఆఫ్ఘన్ నాయకులు ఎవరు?
57. సింధూ నాగరికతకు సంబంధించిన ఏ స్థలము (సైట్) కోటను (సిటాడల్) కలిగి లేదు?
58. భూ అంతర్భాగమును ఈ విధంగా కూడ అంటారు ___.
59. భారత రాజ్యాంగం ప్రకారం మొత్తం ఎన్ని లోక్ సభ స్థానాల సభ్యత్వములను భారత పార్లమెంటుకు కేటాయించడం జరిగింది?
60. మే నెల 2023 సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ సమ్మిట్ (సమావేశం) 2023 ను నిర్వహించబడనుంది. ఈ సమ్మిట్ యొక్క ప్రధాన సారాంశము ఏమిటి మరియు ఈ సమ్మిట్ ఎక్కడ నిర్వహించబడనుంది?
61. ఈ క్రింది వాటిలో ఏ పదార్థంలో అత్యధిక జ్వలన ఉష్ణోగ్రతను కలిగి ఉంటుందని అంచనా వేయబడింది?
62. పర్యావరణానికి సంబంధించి SMOG అను పదానికి నిర్వచనం ___.
63. ఈ క్రింది వాటిని జతపరచుము.
గ్రూప్-I (శాసనములు)
(a) పూనా ప్లేట్లు
(b) మందసోర్ శాసనము
(c) అయ్యవోలు శాసనము
(d) హాతిగుంఫా శాసనము
గ్రూప్-II (కాలము)
(i) గుప్తులు
(ii) వాకాటకులు
(iii) ఖారవేలుడు
(iv) చాళుక్యులు
64. ఈ క్రింది వాటిలో మొక్కలలో పునరుత్పత్తికి సంబంధించిన భాగాన్ని గుర్తించండి.
65. ఢిల్లీ లోని రాజపథ్ యొక్క కొత్త పేరు ___
66. ఈ క్రింది వాటిలోని గ్రూప్-I అంశాలకు సమానమైన గ్రూప్-II అంశాల ఎంపికలతో జతపర్చండి.
గ్రూప్-I
(a) సెడిమెంటరీ రాళ్ళు
(b) మెటామార్ఫిక్ రాళ్ళు
(c) ఇగ్నియస్ రాళ్ళు
(d) ఎక్స్ట్రూసివ్ రాళ్ళు
గ్రూప్-II
(i) కరిగిన లావా చల్లబడిన తర్వాత ఈ రాళ్ళు ఏర్పడతాయి
(ii) శిలా ఫలకాలు (లితిఫికేషన్ ప్రక్రియ) ద్వారా ఈ రాళ్ళు ఏర్పడతాయి
(iii) ఒత్తిడి (ప్రెషర్), పరిమాణము (వాల్యూమ్), ఉష్ణోగ్రత (టెంపరేచర్) PVT వర్గాల ఆధారంగా ఈ రాళ్ళు ఏర్పడతాయి
(iv) శిలా ద్రవాలు చల్లబడి గట్టి పడటం ద్వారా ఈ రాళ్ళు ఏర్పడతాయి
67. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇతర వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటును ___ అంటారు.
68. సైమన్ కమిషన్‌ను ఏ సంవత్సరంలో మరియు ఎవరు నియామకం చేశారు?
69. ఈ క్రింది రాజులను మరియు వారి బిరుదులను ఆధారంగా జతపరచండి.
గ్రూప్-I (రాజులు)
(a) అబుల్ హసన్ కుతుబ్ షా
(b) మొదటి చంద్రగుప్తుడు
(c) అశోక
(d) రాజేంద్ర చోళుడు
(e) ఔరంగజేబు
గ్రూప్-II (బిరుదులు)
(i) మహారాజాధిరాజ
(ii) దేవనంపియ
(iii) జిందా పీర్
(iv) తానాషా
(v) గంగైకొండ
70. ఈ క్రింది వాటిలో దేనివలన అయస్కాంతము తన ప్రభావాన్ని కోల్పోతుంది.
71. ఈ క్రింది యుద్ధములను క్రమానుగతంగా వ్రాయుము.
(A) ప్లాసీ యుద్ధము
(B) బక్సార్ యుద్ధము
(C) రెండవ కర్ణాటక యుద్ధము
(D) మొదటి ఆంగ్లో-మైసూర్ యుద్ధము
72. ఈ క్రింది వాటిని జతపరచుము.
గ్రూప్-I (అశోకుని రాతి శాసనములు)
(a) ధౌళి
(b) ఎర్రగుడి
(c) గిర్నార్
(d) కల్సి
గ్రూప్-II (వేయించబడిన ప్రదేశములు)
(i) డెహ్రాడూన్ జిల్లా, ఉత్తరాఖండ్
(ii) జానాగడ్ జిల్లా, గుజరాత్
(iii) పూరి జిల్లా, ఒరిస్సా
(iv) కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్
73. కర్కట రేఖ ___ రాష్ట్రాల గుండా వెళ్ళుచున్నది.
74. ఈ క్రింది వాటిలో భారత మూలాలున్న ప్రపంచ స్థాయి నాయకులను గుర్తించండి.
75. భారత స్టాక్ మార్కెట్ యొక్క సూచీలను ___ అని అంటారు.
76. వర్ధమాన మహావీరునికి సంబంధించినంతవరకు సరికాని జతను గుర్తించుము.
77. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కాంక్లేవ్ 23 (GIC23), 2023 ఏప్రిల్ 12 న ఏ పట్టణంలో ప్రారంభమగును?
78. బాల్‌పాయింట్ పెన్ ___ సూత్రం ఆధారంగా పని చేస్తుంది.
79. మరాఠా ప్రభువు అయిన శంభాజిని మరియు ఆయన ప్రధానమంత్రి కవికలశ్ను క్రీ.శ. 1689 లో మొగలులు ఏ ప్రదేశములో బంధించినారు?
80. ఈ క్రింది వాటిలో పంటిలోని రంధ్రాలను నింపడానికి వాడే పాదరస మిశ్రమం ఏది?
81. ఏ మొఘల్ రాజా, ఆంగ్లేయుల (బ్రిటిష్) కెప్టెన్ హాకిన్స్ కు స్వాగతం పలికి పోర్చుగీసు పాలకుల ఆగ్రహానికి కారణమయ్యాడు?
82. రెండు వేర్వేరు కంపెనీలు కలిసి ఒక కంపెనీగా రూపాంతరం చెందే క్రమం మరియు కలిసిన రెండు కంపెనీలు వాటి ఉనికిని పూర్తిగా కోల్పోయే పద్ధతిని ___ అంటారు.
83. ఈ క్రింది వాటిలో ఏ దేశంలో భారత రాయబార కార్యాలయం లేదు?
84. ఓడ రేవు పేరు ఆధారంగా అది ఉన్న రాష్ట్రాన్ని జతపరచండి.
గ్రూప్-I (ఓడ రేవు)
(a) ప్రదీప్ పోర్ట్ అథారిటీ
(b) దీన్ దయాళ్ పోర్ట్
(c) జవహర్లాల్ నెహ్రూ పోర్ట్
(d) శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్
(e) కామరాజర్ పోర్ట్ లిమిటెడ్
గ్రూప్-II (రాష్ట్రం)
(i) గుజరాత్
(ii) కోల్‌కతా
(iii) తమిళనాడు
(iv) మహారాష్ట్ర
(v) ఒడిషా
85. షేర్షా కాలంలో 'పరగణా' యొక్క అధికారి ఎవరు?
86. రాష్ట్ర గవర్నర్లను వారి పాలించే రాష్ట్రం ఆధారంగా జతపర్చండి.
గ్రూప్-I (గవర్నర్)
(a) ఎస్. అబ్దుల్ నజీర్
(b) శ్రీ రమేష్ బైస్
(c) ఆనందీబెన్ పటేల్
(d) ఆరిఫ్ మహమ్మద్ ఖాన్
(e) శ్రీ సత్యదేవ్ నారాయణ ఆర్య
గ్రూప్-II (రాష్ట్రం)
(i) మహారాష్ట్ర
(ii) ఆంధ్ర ప్రదేశ్
(iii) కేరళ
(iv) త్రిపుర
(v) ఉత్తర ప్రదేశ్
87. ఈ క్రింది ప్రవచనాలలో సరియైన ప్రవచనాలను గుర్తించండి.
(A) చనిపోయిన జంతువులను తినే ఇతర జంతువులను స్కావెంజర్స్ అంటారు.
(B) సూక్ష్మక్రిములు, శిలీంధ్రాలు మరియు వానపాములు వ్యర్థాలను కుళ్ళబెడతాయి.
(C) మానవ శరీరంలోని సూక్ష్మక్రిములు హానికలిగిస్తాయి.
(D) డీకంపోసర్స్ మరియు స్కావెంజర్స్ లేకపోయినట్లైతే చనిపోయిన జంతువులు మరియు వృక్షాల వల్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉండదు
88. స్వాతంత్ర్య పోరాట సమయంలో జరిగిన సంఘటనలను అవి జరిగిన ఆరోహణా క్రమంలో గుర్తించండి.
(A) జలియన్‌వాలా బాగ్ సంఘటన
(B) ఇండియన్ నేషనల్ ఆర్మీ సహాయం కోసం సుభాష్ చంద్ర బోస్ జపాన్ చేరిన రోజు
(C) మహాత్మా గాంధీ ద్వారా దండి మార్చ్
(D) మహాత్మా గాంధీ ద్వారా చంపారన్ సత్యాగ్రహం
(E) గాంధీజీ ద్వారా క్విట్ ఇండియా మూమెంట్
(F) భగత్ సింగ్, రాజ్‌గురు మరియు సుఖదేవ్ లను లాహోర్ జైలులో ఉరి తీసిన సంఘటన
89. బేకింగ్ సోడా యొక్క రసాయన నామం ___.
90. ద్రవ్య ముసాయిదా చట్టం ఈ క్రింది వాటిలో ఏ చోట ప్రవేశపెట్టకూడదు, అది ఏమిటి?
91. ప్రతి సంవత్సరం, దేశం కోసం వీర మరణం పొందినందుకు సైనికులకు నివాళి అర్పించడానికి ప్రతి సంవత్సరం భారత సైన్యం "ఇన్ఫాంట్రీ డే" (పదాతిదళం రోజు) ఏ రోజున జరుపుతుంది?
92. భారత ప్రభుత్వం ద్వారా ఆమోదించబడిన ఏ విధానము దేశ అంతరిక్ష పరిశోధన విభాగాన్ని ఉత్తేజపరుస్తుంది?
93. ఈ క్రింది ప్రవచనములలో బుగ్వేదానికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి.
(బుగ్వేదంలో 1028 శ్లోకాలు, 10,560 మంత్రాలు మరియు 74,000 పదములు కలవు.)
94. క్రింది వాటిలో మెడికల్ టూరిజం అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఏది?
95. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెల్లించవలసిన మొత్తంలో లోటు ఉన్నప్పుడు వాటిని భర్తీ చేయడానికి తీసుకునే లావాదేవీలను ___ అంటారు.
96. NILP అనునది 2023 సంవత్సరం మార్చి నెలలో భారత ప్రభుత్వం ప్రారంభించిన పథకం. దీని పూర్తి రూపం ఏమిటి?
97. భారత రాజ్యాంగం ప్రకారం ఏ ఆర్టికల్ (నిబంధన) ద్వారా జిల్లా న్యాయాధికారి నియమింపబడతారు?
98. ఈ క్రింది వాటిలో భారతదేశ అంతర్గత భద్రతకు సంబంధించినది ఏది కాదు?
99. ఈ క్రింది వాటిలో ఏ పోషకాలు పాలలో ఉండవు?
100. నృత్య విధానాలను అవి ఉద్భవించిన రాష్ట్రాలతో జతపరచుము.
గ్రూప్-I (నృత్య విధానం)
(a) దండరి
(b) చ్చావు
(c) బిహు
(d) యక్షగాన
(e) దేఖని
గ్రూప్-II (రాష్ట్రం)
(i) అస్సాం
(ii) కర్ణాటక
(iii) గోవా
(iv) పశ్చిమ బెంగాల్
(v) తెలంగాణ
101. రాజులను మరియు వారి పరిపాలనలను ఆరోహణా క్రమంలో గుర్తించండి.
(A) అశోకుడు జరిపిన కళింగ యుద్ధం, లక్షకు పైగా ప్రాణాలు కోల్పోవడం.
(B) చంద్రగుప్త మౌర్యుల రాజ్యపాలన.
(C) జలాలుద్దీన్ ముహమ్మద్ అక్బర్ 13 సంవత్సరాల వయస్సులో చక్రవర్తిగా గుర్తింపబడ్డాడు.
(D) శ్రీకృష్ణ దేవరాయలు ద్వారా ఉదయగిరి, కొండవల్లి మరియు కొండవీడు కోటల ఆక్రమణ.
(E) శివాజీ 16 వ వీట తోర్నా కోటను స్వాధీన పరచుకోవడం.
102. సౌర వ్యవస్థలోని గ్రహాలను వాటి యొక్క చంద్రుల సంఖ్య ఆధారంగా అవరోహణా (ఎక్కువ నుండి తక్కువ) క్రమంలో అమర్చండి.
(A) నెప్ట్యూన్ (Neptune)
(B) అంగారకుడు (Mars)
(C) శని గ్రహం (Saturn)
(D) యురేనస్ (Uranus)
103. ఆర్థిక శాస్త్రంలో తరుగుదల యొక్క ఉద్దేశ్యం ___.
104. నీటి సరఫరా కొరకు మన ఇళ్ళలో ఉపయోగించే ఇనుప పైపులు త్రుప్పు పట్టకుండా ___ తో పూత పూయబడి ఉంటాయి.
105. దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక-2023 కి భారతదేశం నుండి హాజరైన ప్రతినిధులను గుర్తించండి.
(A) ఏక్నాథ్ షిండే (B) గౌతమ్ అదానీ (C) అనిల్ అంబానీ (D) కె. తారక రామారావు (E) ముకేష్ అంబానీ (F) అదర్ పూనావాలా (G) సంజీవ్ బజాజ్
106. ఈ క్రింది టోర్నమెంట్ కప్‌లను వాటికి సంబంధించిన క్రీడలతో జతపరచండి.
గ్రూప్-I (టోర్నమెంట్ కప్)
(a) దురంద్ కప్
(b) బీటన్ కప్
(c) అగర్వాల్ కప్
(d) డేవిస్ కప్
(e) ఎజ్రా కప్
గ్రూప్-II (క్రీడలు)
(i) హాకీ
(ii) బాడ్మింటన్
(iii) పోలో
(iv) ఫుట్‌బాల్
(v) లాన్ టెన్నిస్
107. సరికాని జతను గుర్తించుము.
(1) మద్రాస్ నేటివ్ అసోసియేషన్ - గాజుల లక్ష్మీనరసు చెట్టి
(2) ఇండియన్ అసోసియేషన్ - సురేంద్రనాథ్ బెనర్జీ
(3) ఈస్ట్ ఇండియా అసోసియేషన్ - దాదాభాయి నౌరోజి
(4) బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ - బాలగంగాధర్ తిలక్
108. జన్యు శాస్త్ర పితామహుడిగా పేరుపొందిన వ్యక్తి ఎవరు?
109. ఇనుప ధాతువుకు ప్రసిద్ధి గాంచిన 'బోనాయిఘర్ రేంజ్' నెలకొని ఉన్న రాష్ట్రం ___.
110. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ సమయంలో సర్క్యూట్లో (వలయం) కరెంట్ ___.
111. 'మహారాజాధిరాజ' బిరుదును ధరించిన మొదటి విజయనగర రాజు ఎవరు?
112. డి.ఎన్.ఏ (DNA) యొక్క పూర్తి రూపం ___
113. ఒక దేశ కరెన్సీ ధర వేరే దేశ కరెన్సీ ధరతో మారకం చేయు విలువను ___ అంటారు.
114. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ద్వారా తయారు చేయబడ్డ అగ్ని (AGNI) క్షిపణి గురించి సరియైన వర్ణన ఏది?
115. ఈ క్రింది వాటిని జతపరచుము.
గ్రూప్-I (గ్రంథములు)
(a) బృహత్కథామంజరి
(b) కథాసరిత్సాగర
(c) బృహత్కథ
(d) కాతంత్ర
గ్రూప్-II (రచయితలు)
(i) శర్వవర్మన్
(ii) క్షేమేంద్ర
(iii) సోమదేవ
(iv) గుణాఢ్యుడు
116. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ (BOP) యొక్క భాగాలు ___.
117. అల్లాఉద్దీన్ ఖిల్జీ యొక్క సైనిక సంస్కరణములకు సంబంధించి సరికానిది ఏది?
118. భూమి నుండి వేరే గ్రహం లాంటి సుదూరాలను (లార్జ్ డిస్టెన్సెస్) కొలువడానికి ఉపయోగించే పద్ధతిని ___ అంటారు.
119. భారత ప్రభుత్వం పథకమైన జననీ సురక్ష యోజన (JSY) యొక్క ముఖ్య ఉద్దేశ్యం:
120. భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క పూర్తి పేరును గుర్తించండి.
121. సత్యవర్త్ కడియాన్ అనే ఆటగాడు ఈ క్రింది వాటిలో ఏ ఆటకు సంబంధించిన వాడు?
122. భారత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం ఎవరి సమక్షంలో జరుగుతుంది?
123. ఈ క్రింది వాటిలో బౌద్ధ మతానికి సంబంధించి సరికానటువంటి ప్రవచనం ఏది?
124. భారత వాయుసేన ముఖ్య అధిపతి (చీఫ్ ఆఫ్ ఎయిర్‌ఫోర్స్ స్టాఫ్) గా పని చేసిన తెలంగాణ వ్యక్తిని గుర్తించండి.
125. భారతదేశంలోని సోహాగిఘాట్ ప్రాంతములో క్రీ.శ.1867-68 సంవత్సరములో మొట్టమొదటి రాతి చిత్రాలను ఎవరు కనుగొనిరి?
126. 2023 వ సంవత్సరములో భారతదేశంలోని ఏ రాష్ట్రం "జాగా మిషన్" (JAGA Mission) పథకం UN-హాబిటాట్, వర్ల్డ్ హాబిటాట్ అవార్డును గెలుచుకుంది?
127. ఈ క్రింది వాటిలో ఏది కృత్రిమ మేధస్సుకు సంబంధించిన చాట్‌బాట్ కాదు?
128. శిలాజాలను కలిగి ఉన్న శిలలు :
129. ఏ రాష్ట్రం పాలు మరియు పాల ఉత్పత్తుల యొక్క స్వచ్ఛత నిర్ధారించడానికి "ప్యూర్ ఫర్ ష్యూర్" అనే ప్రచారం ప్రారంభించింది?
130. ఏ బహుమనీ రాజు యొక్క వర్ధంతిని, బీదర్ కు చెందిన హిందువులు మరియు ముస్లిములు కలిసి 'ఉర్స్' జరుపుకుంటారు?
131. DRDO కు సంబంధించిన లేజర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ___ లో ఉంది.
132. మెరాపి పర్వతం ___ కు ఉదాహరణ.
133. ఈ క్రింది వారిలో నోబెల్ పురస్కారానికి సమానమైన అంతర్జాతీయ గణాంకాల పురస్కారం (International Prize in Statistics) 2023 సంవత్సరంలో పొందిన వారిని గుర్తించండి.
134. 'బైసన్' జాతీయ వన్యప్రాణీ సంరక్షణ కేంద్రం నెలకొనివున్న రాష్ట్రం ___
135. మానవ కణంలో ఎన్ని క్రోమోజోమ్ జతలు ఉన్నాయి?
136. మంత్రిత్వ శాఖలను వాటి పథకాలతో జతపర్చండి:
గ్రూప్-I (మంత్రిత్వ శాఖలు)
(a) సూక్ష్మ, చిన్న & మధ్య తరహ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
(b) భారత ప్రభుత్వం ట్రైబల్ ఎఫైర్స్
(c) గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
(d) ఆర్థిక మంత్రిత్వ శాఖ
(e) స్త్రీ మరియు శిశు వికాస మంత్రిత్వ శాఖ
గ్రూప్-II (పథకాలు)
(i) ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన
(ii) ఆత్మ నిర్భర్ భారత్
(iii) ఖాదీగ్రామోద్యోగ్ వికాస్ యోజన
(iv) పోషణ్ (POSHAN) అభియాన్
(v) ప్రధాన మంత్రి జనధన్
137. పత్తి కాయల నుండి పత్తిని మరియు గింజలను వేరు చేయు పద్ధతిని ___ అంటారు.
138. ఈ క్రింది వాటిలో పుస్తకాల రచయితలను ఆధారంగా వారి రచనలను జతపరచుము.
గ్రూప్-I (రచయితలు)
(a) అరుంధతి రాయ్
(b) కుష్వంత్ సింగ్
(c) హాబీబ్ అహ్మద్
(d) ఎ.పి.జె. అబ్దుల్ కలామ్
(e) అటల్ బిహారీ వాజ్‌పేయి
గ్రూప్-II (రచనలు)
(i) కన్స్ట్రక్టివ్ పార్లమెంటేరియన్
(ii) మేరా దేశ్ బదల్ రహా హై
(iii) ఆజాది : ఫ్రీడమ్
(iv) ట్రైన్ టు పాకిస్తాన్
(v) మేరా ప్యారా భారత్ దేశ్
139. భారతదేశంలో రాష్ట్ర యొక్క కార్యనిర్వహణా అధికారాలు ఎవరి ఆధీనంలో ఉంటాయి?
140. ఈ క్రింది చోళ రాజులను వారి బిరుదులతో జతపరచుము.
గ్రూప్-I (రాజులు)
(a) విజయాలయ
(b) పరాంతక
(c) సుందరచోళ అరళమౌళి
(d) రాజేంద్ర చోళ
గ్రూప్-II (బిరుదులు)
(i) రాజకేసరి
(ii) మధురై కొండ
(iii) కడారము గొండ
(iv) రాజ రాజ
141. ఏ సంవత్సరంలో సాలార్ జంగ్ మ్యూజియం ప్రారంభించబడింది?
142. A, B, C, D, E, F లు ఒక కుటుంబంలోని సభ్యులు. F యొక్క తండ్రి A. C యొక్క కుమార్తె E. B యొక్క భర్త D. F యొక్క భార్య C. A యొక్క కుమార్తె B. అయితే E తో D యొక్క సంబంధం ఏమిటి?
143. తెలంగాణ ప్రభుత్వం ద్వారా "నేతన్నకు చేయూత" పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది?
144. క్రింద ఇచ్చిన ఐచ్ఛికాలలో నుండి, మొదటి రెండు పదాల మధ్య ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధాన్ని నాలుగవ పదంతో కలిగిన పదాన్ని ఇచ్చికాల నుండి కనుక్కోండి.
HJL : OQS :: ? : IKM
145. "బలగం" చిత్రం మార్చి, 2023లో ONYKO FILMS అవార్డును ఈ క్రింది వర్గాలలో దేనిలో గెలుచుకుంది?
146. ఈ క్రింది వారిలో, భారతదేశానికి తాత్కాలిక రాష్ట్రపతిగా సేవలందించిన భారతదేశ ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
147. క్రింద ఇచ్చిన నాలుగు ప్రత్యామ్నాయాలలో మూడు ప్రత్యామ్నాయాలు ఒక నిర్ధిష్ట మార్గంలో సంబంధాన్ని కలిగి ఉండడం వల్ల ఒక సమూహంగా ఏర్పడతాయి. ఈ సమూహానికి చెందని ప్రత్యామ్నాయాన్ని కనుక్కోండి.
148. తెలంగాణ హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తిని గుర్తించండి.
149. అష్టభుజి ఆకృతిలోని ఒక డైనింగ్ టేబుల్ చుట్టూ కేంద్రానికి అభిముఖంగా E, I, N, O, Q, S, T మరియు U అనే 8 మంది వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క వైపున కూర్చున్నారు. I అనే వ్యక్తి E కి కుడివైపున మూడవవాడు గానూ మరియు N కు ఎడమవైపున రెండవవాడు గానూ ఉన్నాడు. U అనే వ్యక్తి T కి ఎడమవైపున మూడవవాడు గానూ మరియు N కి కుడివైపున రెండవవాడు గానూ ఉన్నాడు. I మరియు N ల మధ్య S లేడు. T కి వికర్ణం వెంబడి ఎదురుగా Q ఉన్నాడు. అయితే S కి కుడివైపున మూడవదిగా ఉన్న వ్యక్తి ___
150. పురుషత్వం మరియు స్త్రీత్వం గురించి కొంత మంది వ్యక్తులు కలిగి ఉన్న ఆలోచనలను ఈ క్రింది వాటిలో గుర్తించండి.
151. ఈ క్రింది వాటిలోని సంస్థలను, వాటి యొక్క ప్రధాన కార్యాలయాలున్న ప్రదేశాలతో జతపరచుము.
గ్రూప్-I
(a) UNICEF
(b) ILO (అంతర్జాతీయ కార్మిక సంస్థ)
(c) FAO (ఆహార మరియు వ్యవసాయ సంస్థ)
(d) ప్రపంచ బ్యాంకు
గ్రూప్-II
(i) రోమ్
(ii) న్యూయార్క్
(iii) జెనీవా
(iv) వాషింగ్టన్ డి.సి.
152. ఈ క్రింది వారిలో "తెలంగాణ భగత్ సింగ్" గా గుర్తింపు పొందిన నాయకుడు ఎవరు?
153. భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిటీ చైర్మన్ ఎవరు?
154. ఈ క్రింది వాటిలో ఏది నైతిక సూత్రాలకు ప్రత్యామ్నాయంగా పరిగణించబడింది?
155. 2022 సంవత్సరంలో ఆసియాలోని దేశాలలో అత్యధిక స్థాయి దేశీయ ఉత్పత్తి (GDP) కలిగిన దేశాన్ని గుర్తించండి.
156. 1992 సంవత్సరంలో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న కవిని గుర్తించండి.
157. ఒకవేళ 'EDIT' ను '7182322' గా కోడ్ చేస్తే, అదే విధంగా 'FILM' యొక్క కోడ్ :
158. ఒక నిర్ధిష్ట కోడ్‌లో, 'SMILE' ను '@5*7%' అని, 'DOUBT' ను '&3↑8#' అని మరియు 'NOTARY' ను '$3#2Δ9' అని వ్రాస్తే, అదే విధంగా 'REASON' అనే పదాన్ని వ్రాస్తే వచ్చేది :
159. తెలంగాణా రాష్ట్ర పోలీస్ చిహ్నం యొక్క రూపకర్త ఎవరు?
160. ఒక పురుషుని చూపిస్తూ, ఒక స్త్రీ, 'అతను నా తండ్రి యొక్క సోదరి యొక్క కుమార్తె యొక్క కుమారుడు' అన్నది. అయితే ఆ స్త్రీకి ఆ పురుషుడు ఏమౌతాడు?
161. ఒక పరిస్థితిని లేదా ఉద్దేశ్యాన్ని ప్రత్యామ్నాయ కోణంలో చూడగలిగే విధానాన్ని ఈ క్రింది వాటిలో గుర్తించండి.
162. నీతి శాస్త్రం అనేది ___ లో ఏది సరైనది లేక తప్పు అనే దాని అధ్యయనం.
163. నీతిశాస్త్రం మంచి, చెడు, తప్పు మరియు ఒప్పు, ధర్మం మరియు తెలివి, న్యాయం మరియు నేరం లాంటి భావనలను నిర్వచించి మానవుని ___ దాని పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది.
164. క్రింద ఇచ్చిన మొదటి రెండు పదాల మధ్య ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధాన్ని మూడవ పదంతో కలిగిన పదాన్ని ఇచ్చికాల నుండి కనుక్కోండి.
EOPSOLIXN : EXPLOSION :: HEARTBEAT : ___
165. క్రింద ఇవ్వబడిన గుర్తులను ఉపయోగించి కింది ప్రశ్నకు సమాధానమివ్వుము.
'A%B' అంటే 'A మరియు B లను గుణించుము'
'A@B' అంటే 'A కి B ని కూడుము'
'A#2' అంటే 'A యొక్క వర్గము'
'A*B' అంటే 'B చే A ని భాగించుము'.
5 యూనిట్ల భుజము గల చతురస్రం యొక్క వైశాల్యము మరియు 5 యూనిట్ల వ్యాసార్థం గల వృత్తం యొక్క వైశాల్యముల మొత్తం.
166. క్రింద ఇచ్చిన మొదటి రెండు సంఖ్యల మధ్య ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధాన్ని మూడవ సంఖ్యతో కలిగిన సంఖ్యను ఐచ్ఛికాల నుండి కనుక్కోండి.
6 : 15 :: 35 : ?
167. భారత రాష్ట్రపతి తన అధికారాలను ఉపయోగించి ఎంత మంది సభ్యులను రాజ్యసభకు నియామకం చేయగలరు?
168. తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడానికి దోహదం చేసిన "పద్య శాసనం" ఎక్కడ లభించింది?
169. ఏ సంస్థ అతిపెద్దసైతెలియాడే సోలార్ పవర్ ప్లాంట్ (Solar Power Plant) ను తెలంగాణలో ప్రారంభించనుంది?
170. ఒకవేళ 'విద్యార్థి' ని 'ఉపాధ్యాయుడు' అని, 'ఉపాధ్యాయుడు' ని 'ప్రధానోపాధ్యాయుడు' అని, 'బోర్డు' ని 'చాక్' అని, 'బెంచ్ డెస్క్' ని 'టేబుల్' అని, 'తరగతి' ని 'ఇల్లు' అని పిలిస్తే, ఈ కోడ్‌లో, క్రింది వానిలో తప్పుగానున్న ఐచ్ఛికమేది?
171. పురుషులు స్త్రీల కంటే ఉన్నతమైన మరియు శక్తివంతులుగా పరిగణించబడే ఒక సామాజిక వ్యవస్థను ___ అంటారు.
172. భారతదేశ రక్షణ సేన లోని ఏ విభాగము IIT మద్రాసుతో అవగాహనా ఒప్పందం (MOU) సాంకేతిక అభివృద్ధి కొరకు సంతకాలు చేసింది?
173. క్రింద ఇవ్వబడిన అక్షర శ్రేణిలో ఖాళీ స్థానంలో ఏమి వస్తుంది?
BGDE, CHEG, EJGI, GLIK, KPMO, ___
174. 2017 సంవత్సరంలో తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ వార్షిక అవార్డులలో ఏ క్రీడాకారుడు/క్రీడాకారిణికి "స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్" అవార్డు లభించింది?
175. సామాజిక అవగాహన యొక్క రూపం ___.
176. చరిత్రకారుడు జై శెట్టి రామనయ్య ప్రకారం, తెలంగాణలో శాతవాహనుల మొదటి రాజధాని ఏది?
177. లోపించిన పదంతో ఒక పద శ్రేణి ఇవ్వబడింది. శ్రేణిని సంపూర్ణం చేసే సరియైన ఐచ్చికాన్ని ఎంచుకోండి.
బ్యాగ్, పుస్తకం, బెంచీ, పెన్సిల్, ___.
178. ఏ శతాబ్దంలో వేయి స్తంభాల గుడి కాకతీయ రాజుల ద్వారా నిర్మించబడింది?
179. ఒక తరగతిలో, ఒక పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులతో తప్పిన వారికి గల నిష్పత్తి 7:2. ఉత్తీర్ణులైన విద్యార్థులలో అగ్రస్థానం నుండి A యొక్క ర్యాంకు 23 మరియు అధోస్థానం నుండి B యొక్క ర్యాంకు 28. తరగతిలోని విద్యార్థులంతా పరీక్షకు హాజరైతే మరియు A యొక్క ర్యాంకు కంటే 6 ర్యాంకుల దిగువన B యొక్క ర్యాంకు ఉంటే, తరగతిలోని విద్యార్థుల సంఖ్య :
180. క్రింద ఇచ్చిన మొదటి రెండు పదాల మధ్య ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధాన్ని మూడవ పదంతో కలిగిన పదాన్ని ఇచ్చికాల నుండి కనుక్కోండి.
స్ఫిగ్నో మానోమీటర్ : రక్తపోటు :: ఫాతోమీటర్ : ___
181. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన "ధృవ" పోర్టల్ దేనికి సంబంధించింది?
182. ప్రతి సంవత్సరం భారతదేశంలో ఏ రోజున "కార్గిల్ విజయ దినోత్సవం (విజయ్ దివస్)" జరుపుకుంటారు?
183. శాతవాహన రాజుల కాలంలో ఏ భాషను అధికారికంగా ఉపయోగించేవారు?
184. ఏ అంతర్జాతీయ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ తెలంగాణ కొరకు మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ (MoU) చేసుకుంది?
185. క్రింది చిత్రాలలో ఏది కరణీయ సంఖ్యలు, పూర్ణాంకాలు మరియు ఆకరణీయ సంఖ్యల మధ్య సంబంధాన్ని ఉత్తమంగా వర్తిస్తుంది?
186. క్రింద ఇచ్చిన నాలుగు ప్రత్యామ్నాయాలలో మూడు ప్రత్యామ్నాయాలు ఒక నిర్ధిష్ట మార్గంలో సంబంధాన్ని కలిగి ఉండడం వల్ల ఒక సమూహంగా ఏర్పడతాయి. ఈ సమూహానికి చెందని ప్రత్యామ్నాయాన్ని కనుక్కోండి.
187. క్రింద ఇవ్వబడిన పటంలోని మొత్తం త్రిభుజాల సంఖ్య.
188. ఇతరుల భావోద్వేగాలను మరియు వారు వ్యవహరించే విధానాన్ని మార్గనిర్దేశం చేసే సామర్థ్యాన్ని ___ అంటారు.
189. క్రింద ఇవ్వబడిన శ్రేణిలో ఖాళీ స్థానంలో ఏమి వస్తుంది?
C X 15 E V, F U 48 H S, I R 99 K P, L O 168 N M, ___.
190. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేసిన తెలంగాణ గవర్నరు పేరును గుర్తించండి.
191. క్రింద ఇవ్వబడిన సంఖ్యా శ్రేణిలో ఖాళీ స్థానంలో ఏమి వస్తుంది?
11, 22, 46, 90, 160, ___.
192. మన జీవన పరిసరాలలో అనుభవాలకు (subjective) ప్రతిస్పందనలుగా నిర్వచించబడేదాయేది ___?
193. క్రింద ఇచ్చిన నాలుగు ప్రత్యామ్నాయాలలో మూడు ప్రత్యామ్నాయాలు ఒక నిర్ధిష్ట మార్గంలో సంబంధాన్ని కలిగి ఉండడం వల్ల ఒక సమూహంగా ఏర్పడతాయి. ఈ సమూహానికి చెందని ప్రత్యామ్నాయాన్ని కనుక్కోండి.
194. ఒక నిర్ధిశిత కోడ్‌లో 'na ja ba' అంటే 'some good people', 'ba sa ya' అంటే 'many good men' మరియు 'ra sa ja' అంటే 'some bad men'. అయితే ఈ కోడ్‌లో 'many bad people' యొక్క కోడ్.
195. P1, P2, P3, P4, P5, P6, P7 అనేవి ఏడు వేర్వేరు ఇళ్ళు క్రింద వివరించిన విధంగా ఉన్నాయి.
(i) P1 కు దక్షిణంగా P1 నుండి 6 మీటర్ల దూరంలో P2 ఉంది.
(ii) P2 కు తూర్పు దిశలో P2 నుండి 15 మీటర్ల దూరంలో P3 ఉంది.
(iii) P3 కు ఈశాన్యంగా P3 నుండి 6√2 మీటర్ల దూరంలో P4 ఉంది.
(iv) P4 కు తూర్పు దిశలో P4 నుండి 14 మీటర్ల దూరంలో P5 ఉంది.
(v) P5 కు ఉత్తరంగా P5 నుండి 6 మీటర్ల దూరంలో P6 ఉంది.
(vi) P6 కు పడమర దిశలో P6 నుండి 27 మీటర్ల దూరంలో P7 ఉంది.
అయితే P7 మరియు P1 ల మధ్య గల కనిష్ట దూరం (మీటర్లలో) :
196. గొప్ప భారతీయ నాయకులు ఇచ్చిన క్రింది నినాదాలను, అది నినదించిన నాయకునితో జతపరచండి :
గ్రూప్-I (నినాదం)
(a) జై జగత్
(b) కర్ మత్ దో
(c) వేదోం కీ ఓర్ లౌటో
(d) దేశ్ బచావో, దేశ్ బనావో
గ్రూప్-II (నాయకుడు)
(i) దయానంద సరస్వతి
(ii) పి.వి. నరసింహారావు
(iii) వినోబా భావే
(iv) సర్దార్ వల్లభభాయి పటేల్
197. ఇతరుల భావాలను అర్థం చేసుకొని మరియు పంచుకోవడం లాంటి మానసిక ప్రవృత్తిని ఈ క్రింది వాటిలో గుర్తించండి.
198. క్రింది సమాచారాన్ని అధ్యయనం చేసి, క్రింద ఇవ్వబడిన ప్రశ్నకు సమాధానమివ్వు.
'A*B' అంటే 'B కంటే A పెద్దది'
'A#B' అంటే 'B కంటే A పెద్దది కాదు'
'A%B' అంటే 'B కంటే A చిన్నది'
'A$B' అంటే 'B కంటే A చిన్నది కాదు'
'A@B' అంటే 'B కంటే A పెద్దది కాదు; చిన్నది కాదు'.
ఒకవేళ P % Q # R @ S $ T * U ఇచ్చిన, అయితే క్రిందివానిలో ఏది సత్యము కానవసరం లేదు.
199. తెలంగాణ రాష్ట్రం లో పులుల అభయారణ్యాలను గుర్తించండి :
200. క్రింద ఇచ్చిన నాలుగు ప్రత్యామ్నాయాలలో మూడు ప్రత్యామ్నాయాలు ఒక నిర్ధిష్ట మార్గంలో సంబంధాన్ని కలిగి ఉండడం వల్ల ఒక సమూహంగా ఏర్పడతాయి. ఈ సమూహానికి చెందని ప్రత్యామ్నాయాన్ని కనుక్కోండి.